Vijayashanti : కేసీఆర్.. గప్పాలు మీకే సాధ్యం.. ట్విట్టర్విల్లులో విమర్శనాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు పుట్టే పరిస్థితి లేదని.. అయినా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్విల్లులో విమర్శనాస్త్రాలు సంధించారు. ”ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రాన్ని కాస్తా ఇప్పుడు అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు. అప్పు పుడితేనే సర్కార్ బండి ముందుకు కదిలే పరిస్థితి. రిజర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవకాశం లేదు.
మూడు రాష్ట్రాలకు మాత్రమే రూ.8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు మొగ్గు చూపింది. అందులో తెలంగాణ పేరు లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ఏప్రిల్ నెలలో రూ.3 వేల కోట్లు, ఈ నెల 2న రూ.3 వేల కోట్లు అప్పు తీసుకోలేకపోయిన తెలంగాణ.. కనీసం మే 17న రూ.2 వేల కోట్లు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ, రిజర్వు బ్యాంకు చేతులెత్తేయడంతో తెలంగాణలో జూన్ రెండో వారానికల్లా ఇవ్వాల్సిన రైతుబంధు ఆలస్యం అవుతుంది. రైతు బంధు కోసం రూ.7,600 కోట్లు అవసరమవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే.. ఇప్పటికే రైతు బంధు చెల్లింపు ఆలస్యమవుతోంది.
Also Read
2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈసారి కూడా మే నెలలో ఇవ్వడం కష్టమే. రాజపక్సలాగే కేసీఆర్ కూడా పదవి నుంచి దిగిపోతేనే తెలంగాణ బాగుపడుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా చిన్న దొర పాల్గొన్న ప్రతి ప్రోగ్రాంలోనూ తెలంగాణ సూపర్, బంపర్ అంటూ డబ్బా కొట్టుకోవడం మాత్రం కామన్ అయింది. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక… గప్పాలు పోవడం తప్ప కేసీఆర్ సర్కార్‌కే చెల్లింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారు” అని విజయశాంతి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!