తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారని, బీజేపీ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తో పాటు తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ ముక్త్ తెలంగాణ బీజేపీ లక్ష్యం అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పోయి.. బీజేపీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను తీవ్రంగా మోసం చేశాడన్నారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. వ్యక్తి కోసం, కుటుంబం కోసం కాదు.. దేశం కోసమే బీజేపీ వుందన్నారు. ప్రజా సంగ్రామయాత్ర విజయవంతంలో ప్రతి ఒక్క కార్యకర్త కృషి ఉందన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో లక్షల మంది ప్రజలు పాలుపంచుకున్నారు. అమిత్ షా సభ స్పూర్తితో బీజేపీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు తరుణ్ చుగ్.
MLA Jagga Reddy : రెమిడిసవర్ మొత్తం బ్లాక్ దందా జరిగింది