ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్ తగ్గించడంతో వివిధ రాష్ట్రాలు తగ్గించాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాయి.తెలుగు రాష్ట్రాలు కూడా తగ్గించాలని కేంద్రం కోరింది.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్నేహపూర్వకంగా వుండే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలను అస్సలు పట్టించుకోరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం ఏం చేసినా కేంద్రానికి నచ్చదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘రైతు పోరాటానికి మా మద్దతు ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవి. రోజుకు 10మంది రైతులు చనిపోయేవారు. వ్యవసాయంపై ఇప్పటికీ కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రశాంత్ కిషోర్ ద్వారా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లు, ఇంకా రోజురోజుకి అప్పులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ కార్మికుల యూనియన్స్ నాతో సమావేశమయ్యాయి. మేం ఢిల్లీ వెళ్లి వచ్చాక.. సీబీఐ విచారణ ప్రారంభం అయింది. డబ్బులు దాచుకోడానికి సీఎం, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. తెలంగాణలోని రైతులకు సహాయం ఎందుకు చేయరు.? ప్రశాంత్…
కోవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ ఎఫెక్ట్ అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొద్ది రోజుల కింద ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ఛార్జీలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించలేదు. అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ…
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా వున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేసీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం చండీగఢ్ బయలు దేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్. కేసీఆర్ కారులోనే బయలు దేరారు కేజ్రీవాల్. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్‌కు పయనమయ్యారు. గాల్వన్ వ్యాలీ అమరవీరుల జవానులకు నివాళులు అర్పించారు కేజ్రీవాల్, కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అనంతరం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 రైతు…
వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యంమని…. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా… ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. తుంకి మెట్ల లో…
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పరిస్థితి ఉప్పూ నిప్పులా ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజసంగ్రామ యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం ఆ పార్టీలో జోష్ మరింతగా పెంచింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో మీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రైతులతో రచ్చబండ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ రెండు సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శనివారం సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయిన ఆయన రెండున్నర గంటల పాటు దేశ రాజకీయాలపై ముచ్చటించారు. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. తాజాగా ఈ రోజు సీఎం చంఢీగడ్ వెళ్లనున్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు…