తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం, దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31న 11 వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలో జమ ఈ సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఇది పార్టీ ప్రోగ్రాం కాదని గుర్తుంచుకోవాలి.
కేంద్రంలో లో కాంగ్రెసేతర ప్రభుత్వం పది సంవత్సరాల ను విజయవంతంగా పూర్తి చేసుకోబోతోంది. 2024లో కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ నే ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు. ప్రపంచంలోనే ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తున్న ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు…దేశం లో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది. సీఎం సీటును ఎడమ కాలి చెప్పుతో సమానమన్న కేసీఆర్… అదే సీఎం సీటును కొడుకు అప్పగించాలనే పుత్ర వాత్సల్యంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్న రైతులను పట్టించుకోని కేసీఆర్ పంజాబ్ వెళ్లి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్ పేరు రాసి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. గుణాత్మక మార్పు అంటే కేసీఆర్ దృష్టిలో ఏంటి? కుటుంబ పాలన అప్పుల రాష్ట్రంగా మార్చడమా? విదేశీ విధానాన్ని పాకిస్థాన్ లాంటి శత్రు దేశాలు కూడా పొగుడుతున్నాయి. ఇది కేసీఆర్ కంటికి, చెవులకు కనిపించడం లేదా?జాతీయ విద్యా విధానంని విమర్శిస్తున్న కేసీఆర్… కేజీ టు పీజీ విద్య ఎక్కడ సమాధానం చెప్పాలి. ఓడిపోయిన కుటుంబ పార్టీలతో కలిసి కేసీఆర్ ఈ దేశాన్ని ఏం చేయబోతున్నాడు ఈ కుటుంబ పార్టీలన్నీ ఇప్పటికే విఫలం అయ్యాయి. తెలంగాణలో బీజేపీకి లభిస్తున్న ప్రజా స్పందన చూశాక కేసీఆర్ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. గుణాత్మక మార్పు పేరుతో దేశమంతా తిరుగుతున్నారు. 8 ఏళ్లలో ఏనాడూ సెక్రటేరియెట్ కు రాకపోవడమే గుణాత్మక మార్పా?
మీ మిత్రపక్షం ఎంఐఎం ఎంత బాధ పడ్డా తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం… ఎవరు ఆపలేరు. కెసిఆర్ ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ పాలన అంతం కావాలని కోరుతున్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ తెరమరుగైంది. నాయకత్వలేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించే వేసే సత్తా బీజేపీకే ఉంది. అందుకే ముందస్తు ఎన్నికలు,
రాజ్యాంగం మార్చాలని అంటున్నారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అయినా అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్ళింది మాత్రం లేదు. సంక్షేమం అంటున్న కెసిఆర్ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు.కేంద్రం ఏమీ చేయడం లేదని విమర్శిస్తున్న కేసీఆర్… సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని ప్రతిపాదిస్తే, తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెబితే..కొత్తగూడెం-భద్రాచలం వరకు రైల్వే లేన్ వేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు? కేసీఆర్ సహా దేశవ్యాప్తంగా మరో వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేరు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే. ఈసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.
War Of Words: రేవంత్ ‘రెడ్ల’ మాటలపై గులాబీ పార్టీలో మంటలు