అధికారపార్టీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. అధినాయకుడి ఫ్యామిలీకి వీరవిధేయుడు. అలాంటి శాసనసభ్యుడికి హైకమాండ్ ఓ ఆఫర్ ఇచ్చింది. పిలిచి పదవిస్తే ససేమిరా అన్నారు. ఆఫర్ తిరస్కరించి కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? అధిష్ఠానం ఇచ్చిన అవకాశం ఏంటి? తనకు టీటీడీ పదవా అని పెదవి విరిచారట!ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీ పునరాలోచన? తిరుమల శ్రీవారి సేవాభాగ్యం కోసం రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పోటీపడుతుంటారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఒక్కసారైనా పనిచేయాలని కలలు కంటారు. సుదీర్ఘ…
సీఎం జగన్ వైపు కన్నెత్తి చూసినా.. లోకేష్ తాట తీస్తామని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. ఒక అడుగు వేస్తే తాటి మట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని… ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని… ఇటువంటి వ్యక్తులను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడా ? అని నిలదీశారు. చంద్రబాబుకు నిరసన చెప్పటానికి వెళితే నా పై దాడి చేశారని… చంద్రబాబు నోటిని ఫినాయిల్ తో కడగాలని నిప్పులు చెరిగారు.…
ఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు లేఖ రాశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ధర్మ సంస్థాపన కోసం ఈ యుగం లో జన్మించిన వ్యక్తి మోడీ అని… చెడ్డా వారిని శిక్షించే బాధ్యత మోడీ దేనన్నారు. కోర్టులో మా ప్రభుత్వానికినిన్న రెండు మొట్టికాయలు పడ్డాయని… కనక రాజ్ ను పోలీస్ కంప్లైంట్ ఆథారీటీ చైర్మన్ గా నియామకం, రంగుల విషయములో కోర్టు తప్పుపట్టిందని తెలిపారు. సుప్రీమ్ కోర్ట్, హై కోర్ట్…
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక ప్రతీఒక్కరికి ఆరోగ్యం గురించిన అవశ్యకత తెలిసొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా ప్రజా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరుస్తూనే ఉన్నారు. గతంలో ఒకేరోజు వెయ్యి అంబులెన్సులను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ రికార్డు సృష్టించింది. వెయ్యి రూపాయాల కంటే ఎక్కువ ఖర్చు చేసే వ్యాధులన్నింటిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి పేద, సామాన్య ప్రజలకు బాసటగా నిలిచింది. ఆఖరికి కరోనా ట్రీట్మెంట్ ను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో…
ఏపీలో ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. కడప జిల్లా బద్వేల్లో జరుగాల్సిన ఉప ఎన్నిక సైతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఎన్నికకు మరో ఆరునెలల సమయం పట్టొచ్చు. ఇక జగన్ సర్కారు మరో రెండున్నరేళ్లపాటు ఎలాంటి ఢోకా లేకుండా అధికారంలో ఉండనుంది. అయినప్పటికీ ఏపీలో పోలిటికల్ హీట్ మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన…
అప్పుల్లో కురుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడినపెట్టే చర్యలను ఏపీ సర్కారు వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ రావాల్సిన మొండి బకాయిలు, కేంద్రం నిధులు, ఇతరత్రా నిధులపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిసారిస్తున్నారు. ఇటీవల కేంద్రం నుంచి వరుసబెట్టి నిధులను తెప్పించుకోవడంలో జగన్ సర్కారు విజయవంతమైంది. ఇక తాజాగా ఏపీ కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు మేలు చేకూర్చడంతోపాటు ఏపీకి 10వేల కోట్ల రూపాయాల ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా ప్రణాళికలను…
అపథ మొక్కుల వాడికే అపద వచ్చింది అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. అది టీటీడీ దేవస్థానమా, వైసీపీ దేవస్థానమా, జగన్ రెడ్డి దేవస్థానమా అని ప్రశ్నించారు. పాలకమండలి సభ్యులు మరియు ఎక్స్ అఫిషియో సభ్యులు 29 మంది, ప్రత్యేక అహ్వానితులుగా 50 మంది ఉన్నారు. ఇది అన్యాయం, అపచారం, ఇది రూల్స్ కి వ్యతిరేకం. వర్క్ బోర్డ్ మరియు క్రిస్టియన్ కి సంభందించిన సంస్థల్లో కలుగజేసుకు నే ధైర్యం ప్రభుత్వానికి…
ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కెబినెట్ భేటీ జరగనుంది. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై కెబినెట్లో ప్రతిపాదనలు పెట్టనున్నారు. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చించనుంది రాష్ట్ర మంత్రి వర్గం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై ఈ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో…
అమరావతి : డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఐదేళ్లు.. అంతకు మించి ఒకే చోట పని చేసిన వారికి తప్పని సరిగా బదిలీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది ఏపీ సర్కార్.…
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి.. కాసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక క్షేత్రం టీటీడీ విషయం లో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రశంసించిన సుబ్రహ్మణ్యం…