ఏపీలో విద్యాకానుక లబ్ధిదారులకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ షూతో పాటు స్పోర్ట్స్ డ్రస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సూచించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం… ఫౌండేషన్ స్కూళ్ళ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నాడు-నేడుపై సమీక్ష జరిపిన సీఎం జగన్… రెండో విడతలో 12 వేలకు పైగా స్కూళ్లలో పనులు…
రైల్వే ఆన్ లైన్ టిక్కెట్స్ ను ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్రయాలను జరపాలనే నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 8న దీనికి సంబంధించిన జీవోను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో థియేటర్లలో టిక్కెట్ ద్వారా వచ్చే మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుందేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. నిజానికి ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం తన…
నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు… కానీ చంద్రబాబు, టీడీపీ మద్యపాన ఉద్యమం చేస్తాం అంటున్నారు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు. మేము మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం. ఈర్ష్య, ద్వేషం, పగ…ఈ మూడు చంద్రబాబు లక్షణాలు. కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష వేశారు అని పేర్కొన్నారు. తాగుబోతులు, మద్య…
రామచంద్రాపురం పట్టణంలోని చాకలిపేట హైస్కూల్ ను సందర్శించి పిల్లలతో కలిసి తిన్నారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… నాడు-నేడు పనులు, విద్యా కానుక కిట్లు పంపిణీని పరిశీలించాను. జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తున్న భోజన సదుపాయాలను అకస్మిక తనీఖీ చేసాను. చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు.. నేను స్వయంగా తిని చూసాను. జగనన్న గోరు ముద్ద ద్వారా అందిస్తున్న భోజనం మా ఇంటి భోజనం కన్న గొప్పగా ఉందని విద్యార్థులు చెప్పుతుంటే చాలా…
తరచూ వివాదాల్లో చిక్కుకోవడం.. ఆనక పార్టీ పెద్దలతో తలంటించుకోవడం.. ఆ మంత్రికి కామనైపోయిందా? అప్పట్లో పేకాట.. బెంజ్ కారు.. ఇప్పుడు SIని బెదిరిస్తున్న వీడియో…! మళ్లీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పదా? ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథ? ఈ స్థాయిలో వరస వివాదాల్లో చిక్కుకున్న మరో మంత్రి లేరా? గుమ్మనూరు జయరామ్. ఏపీ కార్మిక శాఖ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరామ్.. మంత్రి అయ్యాక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.…
సంక్షేమ పథకాల అమలుకు పెరుగుతున్న భారం.. వీటికి తోడు జీతాలు, పెన్షన్లు ఇతర కార్యక్రమాలకు భారీ స్థాయిలో వెచ్చించాల్సి రావడం.. వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాస్త ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ పరిస్థితిని తట్టుకునేందుకు.. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు.. ఆ శాఖ ఉన్నతాధికారులు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను సైతం బుగ్గన కలిశారు. సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. జనం తిరిగి డబ్బులు…
విద్య..వైద్యం పై ముఖ్య మంత్రి జగన్ కు ప్రత్యేక శ్రద్ధ వుంది అని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సీజనల్ వ్యాధులను గుర్తించేందుకు ఫీవర్ సర్వే ఉదృతి కొనసాగాలి. సచివాలయం.. వాలంటీర్ లను అప్రమత్తం చెయ్యండి అని సూచించారు. ఒక ఇంట్లో జ్వరం వస్తె సచివాలయం ఉద్యోగికి తెలిసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. విశాఖ అన్ని రకాలుగా కేంద్రం కావడంతో రోగుల ఒత్తిడి వుంటుంది. ఆ పరిస్థితికి తగ్గట్టు కేజీహెచ్ లో వైద్య సదుపాయం వుండాలి. నిర్లక్ష్యంగా…
విద్యాశాఖలో నాడు–నేడు, పౌండేషన్ స్కూళ్లుపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో సీఎం జగన్ మాట్లాడుతూ… నూతన విద్యావిధానం అమలు పై అన్ని రకాలుగా సిద్ధం కావాలి. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలి అని సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్ల, టాయిలెట్ల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలి అని తెలిపారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్ ప్రతి స్కూల్లో ఉంచాలి.…
ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారా? త్వరలోనే ఆయన దేశ రాజధానిలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవనున్నారా? ఈ ప్రశ్నలకు.. అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే.. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంట్ సైతం జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సమావేశం ఖరారైతే.. జగన్ ఢిల్లీ బయల్దేరే అవకాశం ఉంది. ఈ ఊహాగానాలు నిజమై ఢిల్లీకి వెళ్తే.. జగన్ ఏం చేయబోతున్నారు? కేంద్రం…
వినాయక చవితి పండగ దగ్గరికొస్తోంది. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కోవిడ్ కారణంగా ఎక్కువగా జనాలు గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇదే.. బీజేపీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇతర కార్యక్రమాలకు అడ్డు రాని కరోనా.. ఇప్పుడు వినాయక చవితి పండగకే అడ్డు పడుతోందా.. అన్న చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ…