వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది పెద్దగా లేదు. అనునిత్యం ఏపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టిసారించారు. ఆయన పాలనపై ప్రజలు సంతృప్తి చేస్తుండగా పార్టీలో మాత్రం కొంత గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తుంది. దీనిని దూరం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు వరుసగా అపాయింట్మెంట్ ఇస్తూ నేతల మధ్య విబేధాలు దూరం చేసేలా…
దేవాదాయ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణా పద్ధతులు తీసుకురావాలి. టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లో ప్రవేశపెట్టాలి. ఆన్లైన్ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ టీటీడీ విధానాలను పాటించాలి. దేవాదాయ శాఖలో అవినీతికి చోటు లేకుండా చూడండి. ఆన్లైన్ పద్ధతులను అమలు చేయడంద్వారా అవినీతి లేకుండా చూడొచ్చు. ఆన్లైన్ పద్ధతులు, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద…
దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దీని పై గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదు అన్న ఆయన అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం జరగనుంది. ఆన్లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల సర్వే నిర్వహించాలని… విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్…
ఏపీ సిఎం జగన్ కు జనసేన నేత పోతిన వెంకట మహేష్ లేఖ రాశారు. 2020 దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఆలయానికి తమరు హామీ ఇచ్చినట్టుగా 70 కోట్ల నిధులను తక్షణమే అమ్మవారి ఆలయానికి మళ్ళించాలని… ఇంతవరకు నిధులు రాలేదని ఈవో భ్రమరాంబ గారు లిఖితపూర్వకంగా తెలియజేశారని లేఖలో పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తున్నారని.. 2019 & 2020 దసరా ఉత్సవాలకు సంబంధించిన నిధులను కూడా తమరు మంజూరు చేయలేదన్నారు. 2021 దసరా ఉత్సవాలు…
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్..జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైసీపీ మంత్రులు మరియు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. అయితే… పవన్ చేసిన వ్యాఖ్యలకు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రులు. కాగా… తాజాగా వైసీపీ సర్కార్ పై వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్…
నెల్లూరు : రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని… ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో…
న్యూ ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్య నాథ్ దాస్ ను నియమిస్తూ… ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్య నాథ్ దాస్ సెప్టెంబర్ 30 న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని.. ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రి హోదాలో న్యూఢిల్లీ లోని ఏపీ భవన్ కేంద్రంగా ఆదిత్య నాథ్ దాస్ పని చేయనున్నారని……
రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంచేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధంచేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. తుపాను అనంతర…
అమరావతి : దేశ రాజధాని ఢిల్లీకి సీఎం జగన్ మరోసారి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎల్లుండి వామపక్ష తీవ్రవాదం పై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న ఈ సమావేశం జరుగనుంది. ఇక ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యం లోనే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు…
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికల్లో మొదలైన…