ఈ నెఖరులోగా పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని… వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచన అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వచ్చే నెలన్నరలోనే ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎంవో అధికారుల సమావేశం ముగిసింది. అనంతరం సజ్జల మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ కార్యనిర్వాహకులుగా ఉద్యోగులు ఉన్నారని… వారి సంక్షేమం, భవిష్యత్తు, ఉద్యోగ భద్రతపై రెండు అడుగులు ముందే ఉండాలన్నది…
న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు… గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు…
మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన బాబు మాట్లాడుతూ కేసీఆర్ గారిని ఎప్పుడైనా సన్మానించామా? అని ప్రశ్నించారు. అంతకు ముందు టాలీవుడ్ లో ఉన్న సంప్రదాయాలను పాటించాలని, అసలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎలా ప్రసన్న చేసుకోవాలి? అనే విషయాలను వెల్లడించారు. మోహన్ బాబు మాట్లాడుతూ “ఆలోచించు, సహాయం కోరుకో. బాధ్యతలు పెట్టుకున్నావు. ముఖ్యమంత్రుల సహాయం లేకపోతే మనమేం లేయలేము. మనం ఏమేం కోల్పోయామో……
సీఎం జగన్ చేతకానితనంతో, అవినీతి ధన దాహంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఓ వైపు విద్యుత్ బిల్లుల మోతలు, మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కరెంట్ ఉత్పత్తి చేయటం చేతకాక సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు ఆపు చేయమంటున్నారు. మరో నెల ఆగితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది…
సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష పార్టీలు నిశితంగా గమనిస్తూనే తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పొత్తులతో వెళుతారా? లేదంటే సోలోగానే ఎన్నికలకు వెళుతారా? అనే చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది.…
అమరావతి : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని…ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని… అలాంటిది ఇప్పుడు విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. సీఎం జగన్ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని… సీఎం నోటి వెంట…
ఏపీ సీఎం జగన్ ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 11వ తేదీ తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు… సీఎం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు… పైకప్పుతో కొత్తగా నిర్మితమైన అలిపిరి మెట్ల మార్గాన్ని, పాదాల మండపం వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని… శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 11న రాత్రికి పద్మావతి…
కలిసి పనిచేయాలని వైసీపీ అధినేత ఆదేశించినా ఆ యువ నేతలు ఖాతరు చేయడం లేదా? ఇప్పటికీ ఎడముఖం పెడముఖమేనా? అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడ్డారా? ఎవరా నాయకులు? ఏమా కథ? కలిసి మీడియా ముందుకు రాలేదు..! రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య రగడపై పది రోజుల క్రితమే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎదుట పంచాయితీ జరిగింది. ఇద్దరినీ కలిసి పనిచేయాలని అధినేత ఆదేశించినట్టు సమాచారం. కానీ.. క్షేత్రస్థాయిలో వర్గాలు ఏకం…
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ రాజకీయవేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలుపు లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి బద్వేల్ పై ప్రత్యేకంగా గురిపెట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు రాకుండా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికలో వైసీపీ ఏమేరకు మెజార్టీ సాధిస్తుందనేది ఆసక్తికరంగా…