కరోనాతో ఏపీలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. అలాగే రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, ప్రభుత్వ…
కాసేపటి క్రితమే…. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ… నిబంధనలు అందరూ పాటిస్తే కరోనా తగ్గిపోతుందని…. ఆలయ భూములు…
అమరావతి : నేడు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు సీఎం వైఎస్ జగన్. విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆశ్రమానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించనున్న సీఎం జగన్.. అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందునితో భేటి కానున్నారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు తాడేపల్లి నివాసానికి…
తిరుపతి ఉప ఎన్నికల వ్యూహాన్నే బద్వేల్‌లోనూ జగన్ కొనసాగించనున్నారా? ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారా? ఇంతకీ బద్వేల్ విషయంలో వైసీపీ ఎలాంటి ప్లాన్ సిద్ధం చేసింది? తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా బహిరంగ సభ పెట్టాలని అప్పట్లో సీఎం జగన్ భావించినా కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేశారాయన. అప్పట్లో ఆయన ప్రచారానికి వెళ్లకపోయినా అక్కడ మంచి మెజార్టీతో వైసీపీ గెలిచింది. ప్రస్తుతం బద్వేల్ ప్రచారానికి…
కర్నూలు : దేవరగట్టు బన్నీ ఉత్సవాల పై సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కర్రల సమరంలో చాలా మంది తీవ్ర గాయాల పాయాలవుతున్నారని..కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని లేఖలో సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. దేవరగట్టు ఉత్సవాలను శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూడద్దని సూచించారు సీపీఐ రామకృష్ణ. ఉత్సవాలకు ఆ రెండు రోజులు బందోబస్తు మాత్రమే కాదని… నిత్యం ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలూరు ప్రాంతంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలని..…
వైసీపీ పెద్దల చేతి వాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి అని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. యూనిట్ రూ.20కి ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలులో మర్మమేంటి అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం అని గుర్తు చేసారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12 వేల కోట్ల బకాయిలు ఉంచింది అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల…
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు నేషనల్ హెల్త్ మిషనులో పని చేసిన ఉద్యోగులు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలో నుంచి తొలగించిందని సోము వీర్రాజుకు వివరించారు బాధితులు. కరోనా రెండు సీజన్లల్లో కష్టపడి పని చేస్తే ప్రభుత్వం మాఉద్యోగాలు ఊడగొట్టిందని సోము వీర్రాజు వద్ద బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించి కొత్త నోటిఫికేషన్ వేస్తుందనే విషయాన్ని వీర్రాజు దృష్టికి తెచ్చారు బాధిత…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని కొట్టారు. ఈ వ్యూహం నాడు సత్ఫలితాలు ఇవ్వడంతో ఏపీలోనూ ఇదే ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు ముందుగానే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి.…
సినీ ప్రియులు, థియేటర్ల యజమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇవాళ విడుదల కానున్న మహా సముద్రంతో…