అమరావతి : సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని లేఖలో కోరారు నారా లోకేష్. ప్రతిపక్ష నేతగా జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలో పర్యటించి కొన్ని హామీలిచ్చారని… ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని ఓసారి, రూ.10 లక్షలు ఇస్తానని మరోసారి మాట మార్చారని తెలిపారు. భూమి లేని వారికి రూ.10 లక్షలు ప్యాకేజ్ ఇస్తానని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమలు చేస్తామని జగన్…
ముహూర్తం దగ్గర పడుతోంది. అలాగే ఆశావహుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయో ఏమో కానీ.. వాటికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలానే ఉంది. అయితే సీనియారిటీ, సామాజిక కోణాల్లో అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆశావహులు. అనంతలో మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ..! ప్రస్తుతం అనంతపురం అధికారపార్టీలో వినిపిస్తున్నది ఒక్కటే మాట. నెక్ట్స్ మంత్రిగా ఎవరికి ఛాన్స్ వస్తుంది. త్వరలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు…
నవ్యాంధ్రలో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీస్తుందనడానికి కిందటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లను సాధించి ఘనవిజయం సాధించింది.. వైసీపీకి ఈ గెలుపు చిరస్మరణీయమైన గుర్తుగా మిగిలిపోగా.. ప్రతిపక్షాలకు మాత్రం పీడకలను మిగిల్చాయి. నాడు మొదలైన వైసీపీ వేవ్ నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది. …
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర లేఖ రాసారు. ఇది రైతు ప్రభుత్వమా..? దగా ప్రభుత్వమా అంటూ ధూళిపాళ బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ఆ లేఖలో… విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల్ని దొంగల్లా చూస్తున్నారన్న భావన కల్పిస్తున్నారు. రైతు భరోసా అమల్లో కులం పేరు చెప్పి లబ్దిదారుల్లో కోత విధించారు. రైతు భరోసా లబ్దిదారులను 64 లక్షల నుంచి 45 లక్షలకు కుదించారు. 15 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా…
స్వచ్ఛ్ భారత్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహాణపై ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ‘క్లీన్ ఏపీ’లో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను పరిశీలించారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. అయితే ఆ వాహానాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై వీర్రాజు మండిపడ్డారు. సోము వీర్రాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చింది. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ.…
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది గతంలో ఎన్నడూ రీతిలో కేవలం 23సీట్లకే పరిమితమైంది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయమే పట్టింది. ఇదే సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా చంద్రబాబు యాక్టివ్ గా పని చేసిన దాఖలాల్లేవు. ఏదో మొక్కుబడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకానీ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో…
రాష్ట్రంలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ , పునరుద్ధరణ అంశాలపై ఏపీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమయ్యారు. దీనికి కురసాల కన్నబాబు , బొత్స సత్యనారాయణ , మేకపాటి గౌతమ్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. వర్చువల్ గా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల బకాయిలపై ప్రత్యేకంగా చర్చించారు మంత్రులు. విజయదశమికి చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది…
బద్వేల్ బై ఎలక్షన్ పై సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కాసేపట్లో బద్వేల్ ఉప ఎన్నిక కసరత్తు సమావేశం కానుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కడప జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. ఎన్నికకు సంబంధించి నేతలకు బాధ్యతలు అప్పగించటం, అనుసరించాల్సిన వ్యూహాల పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ సమావేశం కోసం క్యాంపు కార్యాలయానికి బద్వేల్ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ, మంత్రి పెద్దిరెడ్డి,…
కడప జిల్లాలోని బద్వేల్ లో త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అన్న ప్రచారం జరుగుతోంది. సీఎం సొంత జిల్లా కావడం, సానుభూతి పవనాలు కలిసి రానుండటం, పార్టీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండటం ఇవన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా మారనున్నాయి. గత ఎన్నికల్లోనూ వైసీపీ కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వైసీపీ…
సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ పోసాని అని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా?అని ప్రశ్నించారాయన. జుగుప్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ ఎందుకు బహిరంగంగా వారించలేదు?అని నిలదీశారు. సామాన్యులు వినలేని..మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో…