అనంతపురం : ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు పయ్యావుల కేశవ్. జగన్ ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు జరుగుతున్నాయని… రాయలసీమ పవర్ ప్లాంట్ ను అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారు. అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలుచేయడం ఎవరిదీ తప్పు…? అని ప్రశ్నించారు పయ్యావుల. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమన్నారు పయ్యావుల. ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని… ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా…
బద్వేల్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఎన్నిక ఉత్కంఠగా జరుగుతుందని అంతా భావించారు. అయితే అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న వైసీపీకి ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. అయితే వైసీపీ మెజార్టీపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 44వేల ఓట్ల మెజార్టీరాగా దానిని అధిగమించడమే లక్ష్యంగా ఆపార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. గత…
పదవంటే ఎవరికి చేదు? అందులోనూ మంత్రి పదవి అంటే ఎమ్మెల్యేలకు ఒక డ్రీమ్..! ప్రస్తుతం అలాంటి కలను సాకారం చేసుకునే పనిలో యాగాలు, యాత్రలను నమ్ముకున్నారు ఆ జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు. అమాత్య అని అనిపించుకోవడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారట. వారెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా నుంచి మంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి? కేబినెట్‌లో చోటుకోసం కర్నూలు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలతోపాటు తొలిసారి గెలిచిన ఒకరిద్దరు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పవర్‌లోకి…
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ మరోసారి సీరియస్ అయ్యారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని ఫైర్ అయ్యారు నారా లోకేష్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామసభలో సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకున్నా ఆమోదించాలంటూ ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదనే అక్కసుతో దళిత సర్పంచ్ మాచర్ల పై వైసీపీ నేతలు, వాలంటీర్ కలిసి దాడి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒళ్లు బలిసి దళితుల పై…
ఏపీలో డ్రగ్స్ సరఫరా లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లే ఉండకూడదన్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నాయ్.. అనే విషయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు జగన్. దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్రమ మద్యం, ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. అలాగే.. దిశ యాప్ అమలు పై…
కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఇరుపార్టీలు ఎవరికీ వారు తగ్గేదెలే అన్నట్లుగా మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిగా పైచేయి సాధించారనే టాక్ విన్పించింది. అయితే దీనికి సీఎం జగన్ మార్క్ కౌంటర్ త్వరలోనే పడబోతుందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పవన్ ఇష్యూకి సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సీఎం…
అమరావతి : వైసీపీ సర్కార్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల నిప్పులు చెరిగారు. ప్రజల పై చెత్త పన్ను వేస్తూ చెత్త పాలన కు శ్రీకారం చుట్టారని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. హింస కు, దౌర్జన్యాలే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందన్నారు. స్వేచ్ఛ ను హరిస్తూ స్వచ్ఛ సంకల్పం నిర్వహణ హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీజీ ఫోటో పక్కన.. జగన్ బొమ్మ పెట్టడం జాతి పితను అవమానించడమేనని తెలిపారు.. కమిషన్ల…
సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో హిట్ అందుకున్నారు. ఇదే సమయంలో వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటై ఫుల్ బీజీగా మారిపోయాడు. దీంతో ఆయన రాజకీయంగా కొంత సైలంట్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా జనసేనాని రాజకీయంగానూ దూకుడు చూపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ కు రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2014 ఎన్నికల…
క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేటి నుంచి వంద రోజలు పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ విజయవాడలోఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్లీన్ ఏపీ కోసం చెత్త సేకరించే 4 వేల 97 వాహనాలని ప్రారంభించి.. 13 జిల్లాల కార్మికులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి. పట్టణాలలో 3 వేల 97 హైడ్రాలిక్ గార్బేజ్ ఆటోలు, 1771 ఇ-ఆటోలని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే…
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికల ప్రచారమే జరుగుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎలాగైతే ముందుస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారో? అదే రీతిన సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నపుడు ఎన్నికలకు వెళితే గెలుపు తథ్యమని కేసీఆర్ నిరూపించారు. ఈ ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని…