న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు… గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలి. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన కాంట్రాక్టర్లల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టింది. కాంట్రాక్టర్లెవరూ ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. టీడీపీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.