కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో వున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. 2019లో 77శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ పెంచాలని, మెజారిటీ ఎక్కువ వచ్చేలా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ పొటీచేస్తున్న రెండు జాతీయ పార్టీల గురించే అంతా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అంపశయ్యమీదే వుంది. ఎక్కడా సరైన…
ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష.. దీనికి ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్వీట్లు చేశారు. జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉనికిని…
ఒకవైపు రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న వేళ.. ఈనెల 23 వ తేదీన విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 23 వ తేదీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి బయలుదేరి 4:45 నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. విశాఖలో పలు కార్యక్రమాలతో పాటు ఓ వివాహానికి హాజరవుతారు. ఎయిర్ పోర్ట్ నుంచి 5:20 నిమిషాలకు ఎన్ఏడి కి చేరుకొని అక్కడ నిర్మించిన ఫ్లై ఓవర్…
టీడీపీ నేతలు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పలతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భందా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని అన్నారు. చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల నిప్పులు చెరిగారు. నిన్న వైసీపీ చేసిన అరాచకం నేపథ్యంలో ఏపీ పరిస్థితులపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే నిన్నటి విధ్వంస కాండ చోటు చేసుకుందని… పోలీసులతో కుమ్మక్కై లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కు వైసీపీ పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండారాజ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చారని.. ఇది కాన్సిట్యూషన్ మిషనరీ…
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.…
జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు…
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు.…
తూర్పుగోదావరి జిల్లా పోలవరం నిర్వాసిత గ్రామవాసులు కంటిమీద కునుకు లేకుండా జీవితాలు గడుపుతున్నారు. సీతారం ఆర్ &ఆర్ న్యూ కాలనీ జనావాసాల్లోకి భారీ కొండ చిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు గ్రామస్తులు. ఆత్మ రక్షణ కోసం వాటిని హతమారుస్తున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో అర కొర సదుపాయాలతో నిర్మించిన కాలనీలు జనం పాలిట శాపంగా మారుతున్నాయి. అక్కడ కనీస సదుపాయాలు లేవు. వీధి దీపాలు లేవు,సిమెంట్ రోడ్లు లేవు,డ్రైనేజి వ్యవస్థ అసలే కనిపించడం లేదు,ఊరంతా నీటి…