మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన బాబు మాట్లాడుతూ కేసీఆర్ గారిని ఎప్పుడైనా సన్మానించామా? అని ప్రశ్నించారు. అంతకు ముందు టాలీవుడ్ లో ఉన్న సంప్రదాయాలను పాటించాలని, అసలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎలా ప్రసన్న చేసుకోవాలి? అనే విషయాలను వెల్లడించారు. మోహన్ బాబు మాట్లాడుతూ “ఆలోచించు, సహాయం కోరుకో. బాధ్యతలు పెట్టుకున్నావు. ముఖ్యమంత్రుల సహాయం లేకపోతే మనమేం లేయలేము. మనం ఏమేం కోల్పోయామో… ఒకే విషయం చెబుతున్నాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అయ్యా మేము నటులము. చిన్నా, పెద్దా ఉన్నాము. మాకు కష్టసుఖాలు ఉన్నాయి సహాయం చెయ్యండి అని అడగాలి. వారిని సన్మానించాలి. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకే జరిగింది.
Read Also : చెప్పకూడదు కానీ చెప్తున్నా…. చిరు, చరణ్ సపోర్ట్ పై మంచు విష్ణు
మాకేదైనా అవార్డులు ఇవ్వండి. అందరూ గొప్పవాళ్ళు కాదు ఇక్కడ… మాకేదైనా సహాయం చేయండి అని అడగాలి. మనం తెలంగాణాలో ఉంటున్నాము. నేను స్ట్రెయిట్ గా అడుగుతున్నాను. ఏ రోజైన కేసీఆర్ ను పిలిచి సన్మానించామా? ఆయన దగ్గరకు వెళ్లి కళాకారులకు ప్రతి సంవత్సరం ఇది అలవాటు అని ఆయనను సన్మానించామా ? కాకా పట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి తెలుసు ఆయన నాకు. ఆయన ఎన్నో పథకాలు పెట్టారు. గత సారి ఉన్న ఆంధ్రా ముఖ్యమంత్రికి సన్మానం చేశామా? లేదు. ఆంధ్రాలో ఇప్పుడు సీఎం జగన్ ఉన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి మేము అందరం వస్తాము. మాకు సహాయం చేయండి. మేము మిమ్మల్ని సన్మానించాలి. మిమ్మల్ని గౌరవించాలి వేదిక మీదకు రండి అంటే ఆయన వద్దంటాడా ? సభ్యులారా మీరంతా ఇది నేర్చుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో ఇషమైన పార్టీ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకటే పార్టీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుపుతూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు మోహన్ బాబు.