విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ సర్కారే : పయ్యావుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని…ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని… అలాంటిది ఇప్పుడు విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. సీఎం జగన్ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని… సీఎం నోటి వెంట అర్ధ సత్యాలు.. అవాస్తవాలు పలికిస్తోంది అధికారులేనని తెలిపారు.
సింగరేణి కి బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసింది వైసీపీ కాదా..? ఆర్టీపీపీ.. వీటీపీఎస్ ప్లాంటును మూత వేయించి.. ప్రైవేట్ వాళ్లకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూజా, కృష్ణపట్నం షట్ డౌన్ అయ్యేలా చేసింది వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. అధిక ధరకు పవన విద్యుత్ కొనుగోళ్లు చేయలేని వైసీపీ ప్రభుత్వం.. అదానీ నుంచి అధిక ధరకు సోలార్ విద్యుత్ ఎందుకు కొనుగోళ్లు చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. అదానీ నుంచి కొనుగోళ్లు చేయడం ద్వారా రూ.50 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తారా..? అని నిలదీశారు. ఏపీలోని విద్యుత్ సంస్థలు దివాళా తీయడానికి కారణం వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపే కారణమని నిప్పులు చెరిగారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..