బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఆయనను ఎంపికచేశారు సీఎం, వైసీపీ అధినేత జగన్. ఉద్యమకారుడైన కృష్ణయ్యను జగన్ ఎంపిక చేయడం వెనకాల బీసీలకు న్యాయం చేయాలని తపన వుంది. తెలంగాణలో బీసీ ఉద్యమాలు చేసిన కృష్ణయ్యను జగన్ గుర్తించారు.కానీ సీఎం కేసీఆర్ తనను గుర్తించారని, కానీ ముందుగా జగన్ అవకాశం ఇచ్చారన్నారు. ఈ పదవి వెనుక కేసీఆర్ హస్తం వుందనేది సరైన ప్రచారం అన్నారు. బీసీలు బాగుండాలి, బీసీలు…
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. తొలిరోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. తొలుత ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్ పరిశీలించారు. అనంతరం డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగం అధిపతి శ్యాం…
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపించారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై భారాలు తగ్గిస్తుంటే ఏపీలో ఒక్కసారి…
అమెరికాలోని బోస్టన్‌లో టీడీపీ మహానాడు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్ లో నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఏపీ కోలుకోలేనంత నష్టపోయిందన్న చంద్రబాబు.. అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ధరలు భారీగా పెంచేశారని, వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు. ఏపీలో విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి…
నిన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పటికైనా మారవా..? అంటూ చురకలు అంటించారు. పెట్రోలుపై 31 శాతం వ్యాట్ + రూ.4+రూ.1.. డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ +రూ.4, +రూ.1 పన్నులు వేసి 151…
23, 24, 25 తేదీల్లో జేసీ నాగిరెడ్డి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి టీమ్ లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ పాలనలో కనీసం గుడికి వెళ్లేందుకు కూడా పర్మిషన్ తీసుకోవాలంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జేపీ ప్రభాకర్ రెడ్డి. రాయదుర్గంలో…
1. నేటి నుంచి దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగనుంది. అయితే ఈ నెల 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నిర్వహించనున్నారు. 2. నేడు పోలవరం ప్రాజెక్టను కేంద్ర జలశక్తి అధికారులు సందర్శించనున్నారు. పనుల పురోగతిని శ్రీరామ్ వెదిరె, చంద్రశేఖర్ అయ్యంలు పరిశీలించనున్నారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టు పనులను అధికారుల బృందం పరిశీలించనుంది. 3. ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్…
ఏపీ సీఎం జగన్ శనివారం రాత్రి దావోస్ చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. రేపు డబ్ల్యూఈఎఫ్‌తో జగన్ కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సదస్సు తొలిరోజు పలువురితో జగన్ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో ఏపీ రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనుంది. నూతన…
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జగన్ దావోస్ వెళ్లారని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అయితే సీఎం జగన్ దావోస్ వెళ్లలేదని నేరుగా లండన్ వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపీకి, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందని.. కనీస విలువలను పాటించాలన్న స్పృహ…
ఏపీ సీఎం జగన్‌పై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా అనే అనుమానాలున్నాయి. సీఎం జగన్ ఆ అనుమానాలు నివృత్తి చేయాలి. మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? దండుకున్న సంపద దాచుకోడానికే లండనులో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంది. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..?…