ఏపీ సీఎం జగన్ శనివారం రాత్రి దావోస్ చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. రేపు డబ్ల్యూఈఎఫ్‌తో జగన్ కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సదస్సు తొలిరోజు పలువురితో జగన్ సమావేశం కానున్నారు.
డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో ఏపీ రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేయనుంది. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగం అధిపతి, డాక్టర్ శ్యాం బిషేన్‌తో కూడా సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హన్స్ పాల్‌బర్కనర్‌తో సీఎం జగన్ ఏపీ లాంజ్‌లో సమావేశం కానున్నారు. సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ వేదికలో జరిగే వెల్‌కం రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరు కానున్నారు.
Jagan Davos Tour
Jagan Davos Tour
Jagan Davos Tour
Jagan Davos Tour