1. నేటి నుంచి దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగనుంది. అయితే ఈ నెల 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నిర్వహించనున్నారు.
2. నేడు పోలవరం ప్రాజెక్టను కేంద్ర జలశక్తి అధికారులు సందర్శించనున్నారు. పనుల పురోగతిని శ్రీరామ్ వెదిరె, చంద్రశేఖర్ అయ్యంలు పరిశీలించనున్నారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టు పనులను అధికారుల బృందం పరిశీలించనుంది.
3. ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
4. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,330లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,900లుగా ఉంది.