గొల్లపూడిలో అరెస్ట్ చేసిన దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ (చిన్నా)ను భవానీపురం పోలిస్ స్టేషన్ కు తరలించారు. 41 నోటీస్ ఇచ్చి చిన్నాను విడుదల చేశారు పోలీసులు. మరోసారి పిలిచినప్పుడు స్టేషన్ కు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నా విడుదల అయిన అనంతరం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడారు. టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు… ఏం సాధించవ్ జగన్…? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం…
ఏపీలో టీడీపీ కుదేలైపోయిందని, ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవడం గ్యారంటీ అన్నారు ఏపీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. అచ్చెన్నాయుడు ఏ గాలి పార్టీలో ఉన్నాడు.. మాది గాలి పార్టీనో.. మంచి పార్టీనో.. మా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నామో..అచ్చెన్నాయుడుకి ఆయన గురువుకి బాగా తెలుసు. టీడీపీ రాష్ట్రంలో పూర్తిగా కుదేలైపోయింది.. వాళ్ళేదైనా మాట్లాడుతారు.. రాష్ట్రంలో భావి తరాల భవిష్యత్తు కోసం స్ట్రెయిట్ లైన్ లో వెళ్తున్నాం. మా నాయకుడు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి…
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ప్రతినిధులు. రూ. 7660 కోట్ల నిధులను పంచాయతీ ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని గవర్నరుకి ఫిర్యాదు చేశారు సర్పంచుల సంఘం. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ. 7660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు సర్పంచులు. పంచాయతీ ఖాతాల్లోకి…
జగన్ పాలనపై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. జగన్ ఉన్మాది లా వ్యవహరిస్తున్నారు. నిన్ననే సీబీఐ అధికారులు చెప్పారు. వివేకా హత్య కేసులో స్థానిక అధికారులు సహకరించలేదు అని. గతంలో పరిటాల రవిని చంపారు. హత్యలు చేసి తప్పించుకోవడం…రాజకీయం చేయాలని చూస్తున్నారు. షర్మిల, ఎల్వీ సుబ్రమణ్యం, సవాంగ్ ఎక్కడున్నారు. రాయలసీమకు జగన్ ఏమీ చేశాడో చర్చించేందుకు సిద్దం. పులివెందుల కు ఏం చేశారో చెప్పండి. రాబోయే ఎన్నికల్లో…
ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
ఏపీ సీఎం జగన్ స్విట్టర్లాండ్ బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్ కు పయనం అయ్యారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్ళారు. మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు,…
1. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. 2. నేటి నుంచి కేసీఆర్ జాతీయ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు కేసీఆర్ టూర్ కొనసాగనుంది. వీర మరణం పొందిన సైకి కుటుంబాలకు, రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించున్నారు. 3. నేడు దావోస్‌కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నేడు…
విద్యాశాఖపై గురువారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్ ఆప్షన్‌ను 8.21 లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటి వరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు జరుగుతున్నాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని…
కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మండిపడ్డారు. తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. జగన్ పాలనలో ప్రజలకు వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు తప్పడం లేదని ఎద్దేవా చేశారు. Somu…
ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేదని.. కొనుగోళ్లలో ఘరానా మోసం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులతో కుదిరిన ఒప్పందాన్ని మాత్రం దర్జాగా అమలు చేస్తూ మిల్లర్లు రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల మీద ఈ విషయం చెబుతోన్నా ప్రభుత్వం మొద్దు…