ఏపీ సీఎం జగన్‌పై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా అనే అనుమానాలున్నాయి. సీఎం జగన్ ఆ అనుమానాలు నివృత్తి చేయాలి. మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..?
అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? దండుకున్న సంపద దాచుకోడానికే లండనులో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంది. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..? ఏ దేశ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరారు..? ఏ దేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది..? లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా..? దావోస్ కు వెళ్లడానికి మాత్రమే అనుమతించిందా..? 14 కేసుల్లో ముద్దాయిగా వున్న ఏ1 నిందితుడైన చరిత్ర జగన్ ది.
జగన్ గత చరిత్ర దృష్ట్యా ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తడం సహజమే. కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ సీఎంకైనా గతంలో వచ్చిందా..? ఏపీకి అప్రతిష్ట కాదా..? ఇలాంటి సీఎం టూర్లు గతంలో రాష్ట్ర ప్రజలు చూడలేదు..? దావోస్ కు అధికార యంత్రాగానిదో దారి, ముఖ్యమంత్రి దంపతులదో దారా..? అని యనమల విమర్శించారు.