Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర బీజేపీ- శివసేన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ మంత్రి వర్గ కూర్పు ఖారైంది. ఇరు పక్షాలు చెరో 9 మంత్రి పదవులను పంచుకున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా 18 మందిని మంత్రి పదవులు వరించనున్నాయి. రెండు భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ఇరు పక్షాలు చెరి సమానంగా మంత్రి పదవులు తీసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ, శివసేన పార్టీ నుంచి…
Maharashtra Governor Bhagat Singh Koshiyari controversy comments: గత కొంత కాలంగా మహారాష్ట్రలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే బయటకు రావడంతో పాటు తనతో పాటు 40కిపైగా ఎమ్మెల్యేలు ఉండటంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ షాక్ తగిలింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్రలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న తరహాలోనే తన కాన్వాయ్ కి ప్రత్యేక ప్రోటోకాల్ అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. వీఐపీల కన్నా సమాన్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తన కాన్వాయ్ కోసం బందోబస్లు అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ రజీనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తో చర్చించిన తర్వాత సీఎం…
మహారాష్ట్రలో రాజకీయ చదరంగం ఇంకా ముగిసిపోలేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవిని చేపట్టాడు. బీజేపీ, శివసేన రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని 67 మంది కార్పొరేటర్లలో 66 మంది ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు.…
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనలో తిరుగుబాటు సంచలనమే సృష్టించింది.. చివరకు సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోయింది ఎమ్మెల్యేలే.. ప్రజలు కాదు.. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగినా.. శివసేనకు 100 సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. ఇక, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్న…
మహారాష్ట్ర సంక్షోభం దాదాపుగా ముగిసింది. తాజాగా ఈ రోజు జరిగిన బలనిరూపనలో సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకున్నారు. దీంతో బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మహారాష్ట్రను మరో రెండున్నరేళ్ల పాటు పాలించనుంది. విశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహాారాష్ట్రలో 144 మెజారిటీ కావాలి. అయితే దీని కన్నా 20 మంది సపోర్ట్ షిండే వర్గం సాధించింది. షిండే…
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక, బలనిరూపణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ జూలై 3,4 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు ఏక నాథ్ షిండే బలనిరూపణ పరీక్ష జరగనుంది. దీంతో ఈ రోజుతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. షిండే ప్రభుత్వం సులభంగానే మెజారిటీని ప్రూవ్…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు, రేపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో తన సత్తాను నిరూపించుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ…
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వీట్లు తినిపించడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ వివాదంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. నేను ఎన్నో ప్రమాణస్వీకారాలను చూశానని.. ఇలా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ స్వీట్లు తినిపించడం, పువ్వులు ఇవ్వడం ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు.…
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో చేరారు. అయితే నేడు( ఆదివారం) మహారాష్ట్ర స్పీకర్ ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్ ఎన్నికతో పాటు జూలై 4న షిండే ప్రభుత్వం బలనిరూపణ పరీక్షను…