Maharashtra Governor Bhagat Singh Koshiyari controversy comments: గత కొంత కాలంగా మహారాష్ట్రలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే బయటకు రావడంతో పాటు తనతో పాటు 40కిపైగా ఎమ్మెల్యేలు ఉండటంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ షాక్ తగిలింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలిసి శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం అధికారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని ఒక్కక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే క్యాంపులోకి చేరారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టులో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడటంతో మహా రాజకీయ సంక్షోభం ముగిసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. శుక్రవారం ఓ కార్యక్రమంలోని ప్రసంగంలో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లిపోమంటే..ముఖ్యంగా ముంబై, థానే నగరాల్లో డబ్బు ఉండదని.. ముంబాయి దేశ ఆర్థిక రాజధానిగా ఉండలేదని ఆయన అన్నారు.
Read Also: Mumabi: మ్యాగీ నూడల్స్ లో టొమాటోను కలిపి తిన్నందుకు మహిళ మృతి
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలతో పాటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం టార్గెట్ చేస్తోంది. గవర్నర్ కోష్యారీ కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలను అవమానపరుస్తున్నారంటూ.. ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ స్పాన్సర్డ్ గవర్నర్ మరాఠీ ప్రజలు అవమానించారని.. అయితే ఆత్మగౌరవంతో బయటకు వెళ్లిన శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఎందుకు మౌనంగా ఉంటుందని.. సీఎం షిండే, కనీసం గవర్నర్ వ్యాఖ్యలను ఖండించడం లేదని విమర్శించారు. ఈ వివాదం ఏ వైైపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం గవర్నర్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. శివసేన ఏక్ నాథ్ షిండే, బీజేపీ కూటమిని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లు అయింది.
महाराष्ट्रात भाजपा पुरस्कृत मुख्यमंत्री होताच मराठी माणूस आणि शिवरायांचा अपमान सुरू झाला..स्वाभिमान अभिमान यावर बाहेर पडलेला गट हे ऐकूनही गप्प बसणार असेल तर शिवसेनेचे नाव घेऊ नका..मुख्यमंत्री शिंदे..राज्यपालांचा साधा निषेध तरी करा.मराठी कष्टकरी जनतेचा हा अपमान आहे..
ऐका .. ऐका… pic.twitter.com/dOvC2B0CFu— Sanjay Raut (@rautsanjay61) July 30, 2022