Maharashtra Political Crisis: మహరాష్ట్ర రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించింది. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్‌గా నియమిస్తూ హౌస్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ ఫిరాయించిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్ పై రేపు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. గతేడాది శివసేన తిరుగుబాటుపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత…
మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి ఏక్‌నాథ్ షిండే తప్పుకోనున్నారని ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో ఆధిపత్య పోరులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుర్చీని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా, తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం వస్తుందా? అంటే తాజా పరిస్థితిని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూటమి- ఎన్డీయేలో అనూహ్య మార్పు రావచ్చు. మూలాల ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవిని సీఎం ఏక్నాథ్ షిండేతో మార్చుకోవచ్చు.
Uddhav Thackeray: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక్క శివసేన కార్యకర్త కూడా లేరని ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజు శివసేన(యూబీటీ)నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు.
Maharashtra CM Eknath Shinde To Visit Ayodhya Today: మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అయోధ్యలో పర్యటించనున్నారు. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి వెంట వేల సంఖ్యలో శివసైనికులు రానున్నారు.
Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు…
Maharastra: ఎట్టకేలకు మహారాష్ట్ర ఆధిపత్య పోరుకు తెరపడింది. ఆ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.
Sanjay Raut comments on Karnataka-Maharashtra border dispute: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చరాజేస్తోంది. బెలగావి ఈ మొత్తం సమస్యకు కేంద్రం అవుతోంది. గత కొన్ని దశాబ్ధాలుగా కర్ణాటకలోని బెలగావి తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి చైనా ప్రవేశించినట్లే.. కర్ణాటకలోకి మేం అడుగుపెడతాం అంటూ సరికొత్త…
Measles Outbreak in maharashtra, Mumbai Worst-Hit: మహారాష్ట్రను మీజిల్స్(తట్టు) వ్యాధి కలవరపెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 700కు మించి కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ముంబై నగరంలో చాలా వరకు కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 14మంది మరణించారు. పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్క ముంబై నగరంలోనే 10 మంది మరణించారు. ముంబై ప్రాంతంలో నవంబర్ 28 నాటికి ఈ మరణాలు చోటు…