Pension Distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. ఇక, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాంలో పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై మంత్రి కీలక వ్యాఖ్యలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ,మైనార్టీల,వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమని, రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో…
కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా ఫైర్.. 'సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి.. కానీ, రోజుకు దాదాపు 10 వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని.. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు..
ఆంధ్రప్రదేశ్ లో పీ4 కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ జీరో పావర్టీ లోగోను ఆవిష్కరించారు. P 4 పోర్టల్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. పేదల బాగు కోసం.. మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదం ఇచ్చారు. పీ4లో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములుగా ఉండనున్నారు. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యమన్నారు. పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పీ4 పథకం ఆశయంగా చెప్పారు. Also Read:CM Chandrababu: ఏపీలో పేదరిక నిర్మూలన…
ఏపీలో పేదరిక నిర్మూలన నా జీవిత లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దాని కోసమే చివరి వరకు పనిచేస్తానన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల చేసే పనుల వల్ల పేదలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం చేపట్టే పనుల వల్ల పేదలకు మేలు చేకూర్చాలని నా ఆశయం. స్వర్ణ భారత్ ట్రస్ట్ మాదిరి అనేక సంస్థలు పనిచేయాలి. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్య నాయుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో విలువలు ఉన్న…
ఉగాది పండగ రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. దాంతో 3,456 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుంది. Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు…
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ నడుస్తుంది.. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పాలన తెచ్చాం.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్.. ఏఐతో అన్ని సుసాధ్యాలే అని ఆయన చెప్పారు.
CM Chandrababu: ఇవాళ ఉదయం 9. 30 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయనున్నారు.
ప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు…. హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం,…
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం.. సందిగ్ధంలో బీజేపీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, సూత్రపాత్రయంగా మజ్లిస్ పార్టీకి హస్తం పార్టీ మద్దతు ఇస్తుంది. కాగా, మరోవైపు, గ్రేటర్ హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై భారతీయ జనతా పార్టీ ఇంకా తుది నిర్ణయం…