Deputy CM Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది.. హోంమంత్రి వంగలపూడి అనితపై గతంలో కొన్ని విమర్శలు చేశారు పవన్ కల్యాణ్.. అసలు తానే హోమ్ మంత్రి అవుతా అని పవన్ హెచ్చరించారు కూడా… ఇప్పుడు లేటెస్టుగా అనితపై పొగడ్తలు కురిపించారు పవన్.. ఏదైనా సమస్య వస్తే హోమ్ మంత్రిగా అనిత వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని పవన్ పొగడ్తలు కురిపించారు.. దీంతో, ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, పవన్ కల్యాణ్ కాంప్లిమెంట్ ఇస్తే సేఫ్ జోన్ లో ఉన్నట్లేనా అన్న చర్చ మంత్రివర్గంలో జరుగుతోంది..
Read Also: MLC Kavitha : భౌగోళిక తెలంగాణ సాధించాం.. కానీ సామాజిక తెలంగాణ మాత్రం ఇంకా సాధించాల్సిందే
కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై సీరియస్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాగా గట్టిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలాగే గతంలో మంత్రి అనితపై కొన్ని విమర్శలు చేశారు. తానే హోం మంత్రిని అయితే పరిస్థితి వేరేగా ఉంటుంది అన్నారు పవన్. కొంతమంది పోలీసులు ఇంకా పాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వాసనలతో ఉన్నారని ఆయన డైరెక్ట్ గానే చెప్పేస్తారు. దీంతో మంత్రిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని విమర్శలు వచ్చాయి … కొంతమంది మంత్రుల పనితీరు మీద సీఎం చంద్రబాబు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు.. దీంతో పవన్ కాంప్లిమెంట్ ఇస్తే మనం కూడా సేఫ్ జోన్ లో ఉంటామా అనే అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే పవన్ పొగిడితే , అది తమకు ఒక రాజముద్రగా ఉంటుందన్న అభిప్రాయంతో కొంతమంది మంత్రులు ఉన్నట్టు సమాచారం.
Read Also: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు..
మంత్రులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొగడ్తల వెనక ఇంకో కారణం కూడా కనిపిస్తోంది.. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు.. ఇప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి.. అయితే, చాలా వరకు సీఎం చంద్రబాబు.. మంత్రుల విషయంలో పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు. లేకపోతే సైలెంట్ గా క్లాస్ తీస్కుంటారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ తను కూడా మంత్రి హోదాలో ఉన్నా డిప్యూటీ సీఎంగా కూడా కీలక పాత్ర పోషిస్తున్నానన్న ఉద్దేశ్యంతోనే అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది..