నేడు కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజ్‌లు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలన. ఉదయం 9.30 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌజ్ సందర్శన. ఉదయం 10.30 గంటలకు మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న నేతలు. నేడు మధ్యాహ్న ఒంటిగంటకు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ప్రెస్‌మీట్. కాకినాడలో నేడు అన్నవరం రానున్న టీటీడీ సాంకేతిక బృందం. విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు అంచనాలు వేయనున్న బృందం. దేవాదాయ శాఖకు నివేదిక అందించనున్న టీటీడీ బృందం. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల…
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్ లో కీలక చర్చ జరిగింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది కేబినెట్ భేటీ.. దీంతో.. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను కొత్తగా నిర్మించనుంది ప్రభుత్వం. ఇక, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదించనుంది ఏపీ ప్రభుత్వం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. దీంతో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి..
సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు.
నేడు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీలో గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది.
మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.. కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు ముఖ్యమంత్రి.. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.