రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “మాలాంటి వల్ల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మదనపల్లి లో రికార్డులు తగలబడ్డాయని అంటున్నారు. అదికూడా మేమే చేశామని ఆరోపిస్తున్నారు. ఒక వేళ ఆ రికార్డులు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి. మా మీద కొందరు నిరాధారా ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబానికి తప్పు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు మా పై నమ్మకం ఉంది కాబట్టే ఇన్ని సార్లు ప్రజలు గెలిపించారు. రాష్ర్టంలో ప్రస్తుతం హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. వారిపై పోలీసు అధికారులు దృష్టి పెడుతున్నారా..? ఎక్కడా కూడా రికార్డులు తగలబడితే హెలికాప్టర్లో వెళ్లి చూసిన రోజులు లేవు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Salman Khurshid: భారత్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు జరిగే ఛాన్స్..?
తమ క్యారెక్టర్ ను తప్పు పట్టించే విధంగా కుట్రలు చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. “చంద్రబాబు కి అధికారం వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అంటే ఆయనకు భయ్యం. ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్నారు. హామీలు అమలు చేయలేకే ఖజానా ఖాళీ అని చెబుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తుంది. మా ప్రభుత్వంలో కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. మా ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాం. కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ రంగు పులిమి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కేసులు ఎదురుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కొన్ని టీవీ చానళ్లు మా క్యారెక్టర్ అససినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.” అని తెలిపారు.