అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.
లిక్కర్ స్కామ్పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారని ఫైర్ అయ్యారు
ఒలింపిక్ సన్నాహకాల మధ్య పారిస్లో ఆస్ట్రేలియా మహిళ పై సామూహిక అత్యాచారం పారిస్లో జూలై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించింది. 25 ఏళ్ల ఆస్ట్రేలియన్ యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు రావడంతో ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ ప్యారిస్లోని పిగల్లే జిల్లాలో తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. మహిళ సమీపంలోని కబాబ్ షాప్లో ఆశ్రయం పొందింది. బాధతో, ఆమె…
Land Titling Act: ఏపీ అసెంబ్లీలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆలోచన లేకుండా గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది అని విమర్శించారు. న్యాయవాదులు గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీయే కూటమి సర్కార్ ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు.