ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.