YS Jagan: ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు శ్రీనివాసరావును పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వారు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. దాడులు చేసి ఏమి సాధిస్తున్నారో తెలియడం లేదన్న ఆయన.. ఇలాంటి కిరాతకాలు దారుణాలతో ప్రజలను ఎవరూ భయపడరు.. ఇదంతా ప్రజల్లో కోపంగా మారి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేలా చేస్తుందని హెచ్చరించారు.
Read Also: Store Ginger Garlic: అల్లం వెల్లుల్లి చాలా రోజులు నిల్వ ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
చంద్రబాబు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతుందన్నారు వైఎస్ జగన్.. చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుభరోసా ఎగరగొట్టారు.. బడులకు పోయే పిల్లలకు అమ్మఒడి ఇవ్వకుండా తల్లులను మోసం చేశారు.. 18ఏళ్లు నిండిన మహిళలలకు ఆర్థిక సాయం చేస్తామని ఇంకా ఇవ్వలేదు.. ఫీజు రీఎంబర్స్ మెంట్ , వసతి దీవెన బకాయిలు ఇంకా ఇవ్వలేదు.. మహిళలకు ఇవ్వాల్సిన సున్నావడ్డీ, మత్స్యకార భరోసా ఎగొట్టారు.. పథకాలు అమలు చేయకుండా స్కూళ్లు, చదువులు నిర్వీర్యం చేశారు అంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఎజెండా.. జైశంకర్, అజిత్ దోవల్‌ని కలిసిన అమిత్ షా..
ఇక, భయాందోళలనలు గురిచేస్తూ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవాలని చంద్రబాబు ఆదేశిస్తున్నారు అని ఆరోపించారు వైఎస్ జగన్.. చంద్రబాబు ఓ సారి ఆలోచించు.. చెడు సాంప్రదాయం.. కొనసాగితే చాలా నష్టపోతారు.. చాలా వేగంగా ఈ ప్రభుత్వం తుడిచి పెట్టుకు పోతుంది.. మా ప్రభుత్వం వస్తే టీడీపీ వారికి ఇదే జరిగేలా బీజం వేస్తున్నారు.. తప్పుడు సాంప్రదాయాలు వెంటనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయి.. దారుణాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను అన్నారు. శుక్రవారం నంద్యాలకు వెళ్తున్నా.. అక్కడ దాడికి గురైన బాధితుడిని పరామర్శిస్తా.. దాడులపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం అన్నారు. దాడులపై ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం.. రాష్ట్రంలో రాష్ట్ర పతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.. రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదని అడుగుతున్నా..? రాష్ట్రపతి పాలన కోసం కలుగ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ను కోరుతున్నాను.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం రాష్ట్ర గవర్నర్ కు ఉంది.. గవర్నర్ చూసీ చూడనట్లుగా పోవద్దని విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.