బీసీసీఐకి మోసిన్ నఖ్వీ క్షమాపణలు.. కానీ మళ్లీ ఓ మెలిక పెట్టాడుగా! ఆసియా కప్ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి…
CM Chandrababu: ఒక్కప్పుడు పండగ చేసుకోవడం అంటే భయం.. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోంది.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా.. మరే ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయనగరం జిల్లా దత్తిలో పర్యటించిన ఆయన.. లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం.. అర్హులైన ప్రతి ఒక్కరికి…
AP Cabinet: మరోసారి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీకానుంది.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న మంత్రివర్గ సమావేశంలో.. కీలక అంశాలపై చర్చించనున్నారు మంత్రులు.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన, ఏర్పాట్లపై చర్చించనుంది ఏపీ కేబినెట్. ఈ నెల 16వ తేదీన ఏపీ పర్యటనకు రానున్నారు ప్రధాని మోడీ.. ఈ పర్యటనలో శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత జీఎస్టీపై…
Piyush Goyal: ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చంద్రబాబు నా పెద్దన్న.. సంస్కరణల ఆర్కిటెక్ట్ అని పేర్కొన్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా సీఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవంబర్ 14, 15 రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగే “భాగస్వామ్య సదస్సు”కు పెద్ద సంఖ్యలో వాణిజ్య ప్రతినిధుల బృందం రావాలని ఆహ్వానించారు. కేవలం పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం లేదు.. సరికొత్త ఆలోచనలను పంచుకునేందుకు పెట్టుబడిదారి ప్రతినిధుల బృందాలు రావాలని పేర్కొన్నారు. ఇక, వ్యాపారం నాకు కొత్తేమీ కాదు.. విశాఖలో ఏడు సార్లు “భాగస్వామ్య…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు… మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు కలిగిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వం లో జరిగిన సినిమా మీటింగ్కు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్.. సినీ ప్రముఖుల సమావేశానికి సంబంధించి చర్చించారు. చిరంజీవి లీడ్ తీసుకోవడం.. గట్టిగా మాట్లాడడం వల్లనే…
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది సీఎం తీరు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతామని…
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘భారత దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సాగుతోంది. 11 ఏళ్లుగా ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?. మోడీ చెప్పిన వాగ్దానం అమలులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇంతవరకు ఒక్క…
గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్ తమిళనాడులోని కరూర్ లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే 40 మంది దాకా చనిపోయారు. ఇంకా పదులకొద్దీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమిళనాడు అగ్ర హీరోలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై కమల్ స్పందిస్తూ.. కరూర్ తొక్కిసలాట గురించి విని నా గుండె వణికిపోయింది. ఆ…