ఆదర్శంగా సీఎం కుమారుడు.. సామూహిక వివాహా వేడుకలో పెళ్లి..
ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్ యాదవ్ చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అభిమన్యు యాదవ్, ఇషితా యాదవ్ సామూహిక వివాహ వేడుకల్లో ఒకటయ్యారు.
పరువు హత్య.. ప్రియుడి డెడ్‌బాడీని పెళ్లి చేసుకున్న యువతి..
మహారాష్ట్ర నాందేడ్‌లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. తన కూతురును ప్రేమించడానే కారణంతో తండ్రి, 20 ఏళ్ల యువకుడిని కాల్చి, తలను రాయితో కొట్టి చంపేశాడు. అయితే, ప్రియురాలు మృతుడి డెడ్‌బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంచల్, సాక్షం టేట్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆంచల్‌కు తన సోదరుల ద్వారా సాక్షం టేట్ పరిచయమ్యాడు. తరుచుగా సాక్షం టేట్ ఇంటికి వెళ్లే ఆంచల్ క్రమంగా అతడితో సంబంధాన్ని పెంచుకుంది. అయితే, వీరి కులాలు వేరు కావడంతో ఆంచల్ కుటుంబం వీరి సంబంధాన్ని ఒప్పుకోలేదు. అనేక సార్లు బెదిరించినప్పటికీ ఆంచల్, సాక్షం టేట్‌తో తన ప్రేమను కొనసాగించింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 11 మంది మృతి..
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగై జిల్లాలోని కుమ్మంగుడి సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపత్తూర్ ప్రాంతంలోని పిళ్లైయార్‌పట్టికి 5 కి.మీ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లపై అదిరిపోయే మాస్ డ్యాన్స్ సాంగ్..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మొస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” 72 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి, సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. మరోవైపు ఈ చిత్రంలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కానుంది. ఇకపోతే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేయబడిన భారీ సెట్లో చిరంజీవి–వెంకటేష్‌లపై స్టైలిష్ డ్యాన్స్ షూట్‌ను మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఓ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్‌లో కలిసి కనిపించడం విశేషం.
ఆయనతో నటించడం నా అదృష్టం.. అఖండ2 అందరినీ అలరిస్తుంది..!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో నిర్మితమవుతున్న పవర్‌ఫుల్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా 2D, 3D ఫార్మాట్‌లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
దారుణం.. నర్సరీ చిన్నారిపై ఆయా పైశాచిక దాడి.!
మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ ప్రాంతంలో గల పూర్ణిమా స్కూల్లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ ఆయా అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్కూల్లో చిన్నారిపై జరుగుతున్న ఈ దారుణాన్ని స్కూల్ పక్కన ఉన్న ఇంటిపై నుండి ఓ యువకుడు వీడియో రికార్డ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో దృశ్యాలు ఆ ఆయా ఎంతటి క్రూరంగా ప్రవర్తించిందో స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోనే ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.
రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం.. తీవ్ర విమర్శలు చేసిన సీఎం స్టాలిన్…
తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు. దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఈ సమస్య పేర్ల గురించి కాదని, ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం గురించి అని అన్నారు. ఈ పేరు మార్పులు అనవసరమని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల అధకారాన్ని గౌరవించడంలో నిజమైన జవాబుదారీతనం ఉందని చెప్పారు.
2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ మా లక్ష్యం
రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా, ఈ విజన్ పాలసీ లక్ష్యాలు, ప్రణాళికలపై ఆయన కీలక వివరాలను వెల్లడించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “తెలంగాణను 2037 వరకు 1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తక్షణ లక్ష్యం. అలాగే, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తుది లక్ష్యం. ఈ లక్ష్యాలను సాధించేందుకు వీలుగానే మేము తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పాలసీని రూపొందిస్తున్నాం,” అని స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలో ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండేలా చూస్తున్నామని, వాటి మధ్య సమతుల్యతను కొనసాగించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
ఈవీల నుంచి మిస్సైల్స్ వరకు.. “రేర్ ఎర్త్” మూలకాలు ఏమిటి.. భారత్‌కు ఎందుకు అవసరం..
ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ జపం చేస్తోంది. చైనా, అమెరికా, భారత్ ఇలా ప్రతీ దేశానికి ఈ అరుదైన మూలకాలు కావాలి. ఇప్పుడు, ప్రపంచాన్ని శాసించేది ఇదే. మన సెల్ ఫోన్ నుంచి టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, రాకెట్లు, మిస్సైల్స్ ఇలా ప్రతీ దాంట్లో ఈ అరుదైన మూలకాల అవసరం ఉంది. అందుకే వీటికి ఇంత డిమాండ్ ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఈ అరుదైన మూలకాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రపంచంలో రేర్ ఎర్త్ మూలకాలు, రేర్ ఎర్త్ అయస్కాంతాల్లో చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. దీనిని అడ్డుకోవాలంటే భారత్ ఈ రంగంలో స్వావలంభన సాధించాల్సి ఉంది.
రాష్ట్రం 3 విభాగాలుగా వర్గీకరణ.. ఔటర్ ఔట్‌సైడ్ కొత్తగా రీజినల్ రింగురోడ్డు
తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు , ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజా పాలనలో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, భవిష్యత్ పాలసీ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంట్‌కు ‘రైజింగ్ 2047’గా నామకరణం చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.