ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. నేడు ప్రధాని మోడీతో భేటీకానున్న రేవంత్, భట్టి. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న సీఎం రేవంత్.
నేడు మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. 182 మండలాల్లో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36452 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. డిసెంబర్ 5న నామినేషన్ల స్వీకరణకు లాస్ట్ డేట్. డిసెంబర్ 6న నామినేషన్ల పరిశీలన. డిసెంబర్ 7న అభ్యంతరాలు స్వీకరణ. డిసెంబర్ 9న నామినేషన్ల ఉపసంహరణ. డిసెంబర్ 9న వ్యాల్యూడ్ నామినేషన్ల ప్రకటన. డిసెంబర్ 17న పోలింగ్.
తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,684 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 20,515 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.75 కోట్లు.
అమరావతి: ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు జాతీయ స్థాయి ఏకలవ్య…మోడల్ రేసిడెన్షియల్ స్కూల్..సాంస్కృతిక ఉత్సవాలు. కేఎల్ యూనివర్సిటీ లో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం. జాతీయ స్థాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్) సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వేడుకలు. ఉద్భవ్-2025 పేరుతో ఉత్సవాల నిర్వహణ. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం ముఖ్యఅతిథిగా హాజరు.
అమరావతి : ఈరోజు తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. నల్లజర్లలో “రైతన్నా… మీ కోసం” వర్క్ షాప్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి. సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.
చెన్నై: తీరం దాటిన అల్పపీడనం. సముద్రంలోనే బలహీన పడి తీవ్ర అల్పపడనం గా దాటిన తీరం. మహాబలిపురం వద్ద తెల్లవారు జామున తీరం దాటిన తీవ్ర అల్పపీనం. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా లో భారీ వర్షాలు.. మరో 48 గంటలపాటు అతి భారీ వర్ష హెచ్చరిక. విద్యాసంస్థలకు సెలవులు.. చెన్నై నగరంలో నీట మునిగిన పలు ప్రాంతాలు. రోడ్లపై భారీగా చేరిన నీరు… అత్యవసర సేవలు మినహా, మూత పడ్డ ప్రైవేటు, వ్యాపార సంస్థలు,
కోకాపేట నియోపోలీస్ భూములకు నేడు మూడో విడతలో ఈ వేలం. ఈరోజు ప్లాట్ నంబర్స్ 19, 20 లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేయనున్న అధికారులు. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాలకు 2,708 కోట్ల రూపాయలు పొందిన HMDA. అత్యధికంగా రికార్డు స్థాయిలో ఎకరానికి 151 కోట్ల 25 లక్షలు పలికిన ధర. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో ఈ వేలం వేస్తున్న HMDA. కోకాపేట లోని 29 ఎకరాలు, మూసాపేట లోని 15 ఎకరాల భూమికి వేలం.
విజయవాడ : లిక్కర్ కేసులో నిందితుడు అనిల్ చోఖర ను మూడో రోజు కస్టడీ కి తీసుకోనున్న సిట్. నేటితో ముగియనున్న అనిల్ చోఖర కస్టడీ. కేసులో అరెస్టయిన ఏ51 రోణక్ కుమార్ ను కోర్టులో హాజరు పరచనున్న సిట్.
నేడు సిట్ ముందుకు జోగి సోదరుల కుమారులు. కల్తీ మద్యం కేసులో విచారణకు హాజరుకానున్న రాజీవ్, రోహిత్, రాకేష్, రామ్మోహన్.
నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన.