Vizianagaram Utsav: విజయనగరం జిల్లాలో ఈ నెల 14, 15వ తేదీలల్లో జరిగే పైడితల్లి అమ్మవారి తోల్లేళ్లు, సిరిమానోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ సహచర మంత్రులు అందరినీ ఆహ్వానిస్తూ వారికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
YS Jagan: రేపల్లె నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు.. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది, ఇది సృష్టి సహజం.. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష.. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన.. ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే రతన్ టాటాకు నివాళులర్పించింది.. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై ఎలాంటి చర్చ చేపట్టకుండానే వాయిదా పడింది.. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఏపీ మంత్రివర్గం
రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం.. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా.. హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏను గెలిపించారన్నారు.
వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద సాయంపై చర్చకు రావాలని సవాల్ చేశారు.. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అని చాలెంజ్ చేశారు..