వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..
దసరా శరన్నవరాత్రులు బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై 7వ రోజు వైభవంగా సాగుతున్నాయి.. ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమ్మవారిని దర్శించుకోనున్నారు..
మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు వస్తారని అంచనా.
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం అన్నారు.. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారు.. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించ లేక పోతున్నారు.. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి.
టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరణకు శ్రీకారం చుట్టింది.. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరణకు స్వయంగా రంగంలోకి దిగారు టీటీడీ ఈవో శ్యామలరావు.
CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మానవత్వం చాటుకున్నారు. తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా ఆయన అందించారు.