జమిలి ఎన్నికల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. జమిలి ఎన్నికల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులు.. సవరణలు విషయంలో బీజేపీ అవలంబిస్తున్న తీరు చూస్తున్నామన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్ ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా…
వివాదంగా మారిన తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకాలని రాజకీయ పార్టీలను, మీడియాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేయడం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అభ్యంతరకరం అన్నారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడే నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో..? మనం నిమిత్త మాత్రులం. దేవుడే అన్నీ చేయిస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యుని వినియోగించారని.. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఆమోదించిన టెండర్ వల్ల కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే విషయాన్ని ఈవో శ్యామల రావు నిర్ధారించారు. జాతీయ స్థాయిలో పేరొందిన NDDB ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అధికార టీడీపీ.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ అపచారం నువ్వు చేశావంటే నువ్వు చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆధిక్యమెంతంటే..? బంగ్లాదేశ్తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు…
అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర..! అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై…
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు ముఖ్యమంత్రి.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించినవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..
స్టీల్ ప్లాంట్న ను ఏదోరకంగా మూసేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. కూటమి సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ను ప్రవేటీకరించను అని చెప్తున్నాడు.. కానీ, ఇది మాటలకే పరిమితం, తప్ప చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్లు GST చెల్లిస్తోంది.. ఇప్పుడు షరతులతో కూడి 500 కోట్లు ఇస్తామని చెప్పడం తెలుగు ప్రజలును అవమానించడమే…
మొదటి రోజు ముగిసిన ఆట.. భారీ స్కోర్ దిశగా భారత్ చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (86*), అశ్విన్ ఉన్నారు. తొలి రోజు ఆటలో ముగ్గురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్..…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల చంద్రబాబు పాలనలో ఆరుసార్లు క్యాబినెట్ సమావేశమైనా.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని విమర్శించారు. పన్నులు వేయటం, జనాన్ని పీక్కుతినటం తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చారు, పన్నులు పెంచారు.. చంద్రబాబు వచ్చారు, జనాన్ని వరదల్లో ముంచారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.