Polavaram Irrigation Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పోలవరం నిర్మాణం పై సమీక్షలు నిర్వహించనున్నారు.. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్మాణ సంస్ధలతో భేటీ కానున్నారు.. సచివాలయంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు- ఈఎన్సీ ఎం. వెంక టేశ్వరరావు తదితరులు నిర్మాణ సంస్థలతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తారు.. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులకు మరింత సమయం పడుతుందని మేఘా ఇంజనీరింగ్ చెబుతోంది..
Read Also: Astrology: అక్టోబర్ 22, మంగళవారం దినఫలాలు
అయితే, వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయం తీసుకున్నాయి.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపేజీ జలాలు ఉన్నందున అప్పటికి పూర్తిచేయలేం అంటున్నారు.. వాల్ నిర్మాణ షెడ్యూల్ జలవనరుల శాఖకు అందించాల్సిన మేఘా ద్వారా బావర్ అందించలేదు.. సీపేజీ జలాలు ఎక్కువగా ఉన్నందున అత్యంత ఖరీదైన యంత్రాలు పాడైపోయే ప్రమాదం ఉంది.. డయాఫ్రం వాల్ 2026 ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తాం అంటున్నారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మా ణానికి మూడు సీజన్లు పడుతుందని అంచనా వేస్తన్నారు.. 2029 నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉంది అంటోంది మేఘా సంస్థ..