Anchor Shyamala: దిశ లాంటి గొప్ప చట్టాన్ని నిర్వీర్యం చేశారు.. శ్యామల కీలక వ్యాఖ్యలు
- కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కీలక వ్యాఖ్యలు
- దిశ యాప్‌ను మళ్లీ తీసుకురావాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Shyamala: కూటమి ప్రభుత్వం పాలన మహిళలకు చీకటి కాలమని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కారణం ఎవరు.. నేరస్థులకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేయటం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కూటమి బలాన్ని ఎందుకు వాడుకుంటున్నారు.. అధికారులపై ఒత్తిడి తేవడం కోసం వాడుకుంటున్నారని శ్యామల అన్నారు. మహిళకు రక్షణ కోసం కూటమి బలాన్ని చంద్రబాబు వాడుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో బాధిత మహిళ న్యాయం కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళవలసి వచ్చిందని.. చివరికి ఆమెతో రాజీ కుదిర్చారని ఆరోపించారు. దళిత బాలిక అయినందుకు బాధితురాలిని పవన్ కళ్యాణ్ పరామర్శించలేదని విమర్శలు గుప్పించారు.
Read Also: CM Chandrababu: 15 రోజుల్లో డ్రోన్ పాలసీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
హిందూపురంలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి ఎక్కడ… మీకు ఆ బాధ్యత లేదా…మీరు మహిళే కదా అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ప్రవేశపెట్టిన దిశ యాప్‌ని మళ్ళీ తీసుకురావాలన్నారు. వీటి వల్ల ఏదొక విధంగా మహిళకు సహాయం అందుతుందన్నారు. దిశ లాంటి గొప్ప చట్టాన్ని రాజకీయ కక్షతో పక్కన పెట్టారని అన్నారు. పత్రికలలో ప్రకటనలు తప్ప చేతల్లో ఏమి లేదని పేర్కొన్నారు. 200మంది మహిళలపై దాడులు జరిగాయన్నారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా రెచ్చిపోతోందని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక తాగేందుకు నీరు లేక డయేరియాతో జనం చచ్చిపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంక ఎన్నాళ్లు ఈ దారుణాలని తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారన్నారు. మీరు ఇలానే వ్యవహరిస్తే ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తామని శ్యామల మండిపడ్డారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!