ఇరాన్లో భారీ స్థాయిలో సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యంగా.. పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, అణుస్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దీని వల్ల సమాచారం చోరీకి గురైందని…
వ్యాపారులను వేధించే నైజం మాది కాదు.. వ్యాపారులను ఎవరైనా వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. వ్యాపారులను ఎవరు వేధించినా సహించేది లేదన్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు..
ఈ నెల 16వ తేదీన ఏపీ కెబినెట్ భేటీ కానుంది. ఈ నెల 10వ తేదీన జరగాల్సిన కెబినెట్ అజెండా వాయిదా పడటంతో.. ఆరోజు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. నిన్న జరిగిన కేబినెట్ రోజు.. రతన్ టాటా చనిపోవడంతో అజెండాను మంత్రి వర్గం వాయిదా వేసింది.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల అహంభావం వల్లే సులభంగా విజయం సాధించాల్సిన హర్యానాలో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది.. ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ బాగుకోసం కోట్ల రూపాయాలు కేటాయించామన్నారు. ఇప్పటికీ వున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షన్సియల్ స్కూల్స్ కొనసాగిస్తామన్నారు. ఏవి కూడా ముసేసిది లేదన్నారు. అన్నింటికీ శాశ్వత భవనాలు కల్పిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఉడుత ఊపులకు ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎవరు…
పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 49 విభాగాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. వివిధ అంశాలపై మొత్తంగా 24 పాలసీలు రూపొందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుఉ పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్.. గత ప్రభుత్వ హయాంలో తరిమేసిన అన్ని పరిశ్రమలను మళ్లీ తీసుకొస్తాం అన్నారు.. టీసీఎస్ను తామే ఏపీకి తీసుకొచ్చామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్.. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయి అన్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది.. ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.