CM Chandrababu: 15 రోజుల్లో డ్రోన్ పాలసీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
- పదిహేను రోజుల్లో డ్రోన్ పాలసీ తెస్తామని ప్రకటించిన సీఎం..
- అమరావతిలో డ్రోన్ సమ్మిట్ 2024ను ప్రారంభించిన చంద్రబాబు..
- పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పదిహేను రోజుల్లో మేం ఒక డ్రోన్ పాలసీని తెస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతిలో జరుగుతోన్న దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ 2024ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ తీసుకొస్తాం.. ఓర్వకల్లు, కర్నూలు ప్రాంతంలో ఒక డ్రోన్ తయారీ కేంద్రంగా తీసుకురావాలన్నారు.. అన్ని ప్రధాన నగరాలకు కర్నూలు-ఓర్వకల్లు హబ్ దగ్గరలో ఉంటుంది.. కేంద్రానికి మేం ఇచ్చే అద్భుతమైన ప్రధాన అవకాశం ఇది అని పేర్కొన్నారు.. ఇక, నరేంద్ర మోడీ లాంటి టెక్నాలజీ అర్ధం చేసుకున్న ప్రధానిని చూడలేదన్న ఆయన.. నరేంద్ర మోదీ చేయలేరంటే.. ఇంకెవరూ చేయలేరన్నారు.. ఏపీ మొట్టమొదటి యూజర్ రాష్ట్రంగా ఉంటుంది.. భారతదేశ భౌగోళిక పతిస్ధితులు టెక్నాలజీకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.. అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం అన్నారు..
Read Also: AP and Meta Key MoU: మెటాతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. ఇక, సర్టిఫికెట్ల కష్టాలకు చెక్..
Also Read
ఇలాంటి ఒక డ్రోన్ సమ్మిట్ చాలా మంచిది.. ఇది ఒక మార్పు తీసుకొస్తుందన్నారు.. మనకు అడ్వాన్స్‌డ్ డ్రోన్స్, సీసీ కెమెరాలు, ఇతర ఐఓటీ పరికరాలు ఉన్నాయన్నారు. జాబ్ అడిగే వారు కావద్దు.. జాబ్స్ ఇచ్చే వారిగా మారాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, తెలుగు కమ్యూనిటీ నుంచే 30 శాతం మంది జాబ్స్ ఇచ్చే వారుగా ఉన్నారన్న ఆయన.. ఎమిరేట్స్ నుంచి మొదటి ఫ్లైట్ హైదరాబాద్‌కు తెచ్చాం.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయిని ఒప్పించాను అని గుర్తుచేసుకున్నారు.. ఔటర్ రింగ్ రోడ్, బయో టెక్నాలజీ పార్క్, ఐటీ.. ఏది చెప్పినా.. అన్నీ తెచ్చాం.. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని బ్రాండ్ గా మార్చారు ప్రధాని మోడీ అన్నారు.. వికసిత్ భారత్ కోసం మోడీ పని చేస్తున్నారు.. 400 TB డేటా మనకు రాష్ట్రంలో ప్రతిరోజూ సమకూరుతోంది.. డిజిటల్ కరెన్సీ పై ఒక రిపోర్టు కావాలని ప్రధాని మోడీ నన్ను అడిగారు.. జనధన్, ఆధార్, మొబైల్ లను అనుసంధానం చేయడం.. జామ్ అనే దానిని ప్రధాని తీసుకొచ్చారు.. ఎంత డేటా ఉందనేదే రాబోయే రోజుల్లో ఆస్తి.. క్లౌడ్, డేటా.. ఊబరైజేషన్ చేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఒక సక్సెస్ సాధిస్తాం అన్నారు.
Read Also: Kaleshwaram Investigation: రేపటి నుంచి రెండు విడతల్లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
విజయవాడ వరదల్లో డ్రోన్ల ఉపయోగంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వరదల్లో డ్రోన్ల నా సెక్రెటరీ సురేష్ ను అడిగాను.. నీరు డ్రైనేజీలలో నుంచి పోయినప్పుడు.. ఆ ప్రదేశాలను కూడా వరదల్లో డ్రోన్ ద్వారా గుర్తించాం.. డ్రోన్ ద్వారా డేటా కేరీ చేయచ్చు.. అలాగే వ్యవసాయానికి, క్రైం ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్, నేరాలు పరిశోధనకు డ్రోన్ వాడచ్చు అన్నారు. రౌడీషీటర్లకు ఛాలెంజ్… వాళ్లు క్రైం చేస్తే గంటల్లో పట్టుకునే విధానం తెస్తాం అని ప్రకటించారు.. వ్యవసాయంలో కూడా డ్రోన్ వినియోగం ఉంటుంది.. నిర్ణయాలు అప్పటికప్పుడే ఎలాంటి లోపం లేకుండా తీసుకోడానికి డ్రోన్ లు వాడచ్చు… డ్రోన్ తో మట్టి పరీక్షలు చేయచ్చు.. 70 శాతం రోగులు అనసరంగా అడ్మిట్ అయ్యి డబ్బులు కడుతున్నారు.. డ్రోన్ వినియోగం ద్వారా రోగులు ఆసుపత్రిలో అనవసరంగా అడ్మిట్ అవ్వకుండా చూడచ్చు అన్నారు.. ఏపీలో డ్రోన్ కంపెనీలు తాము తయారు చేసిన అప్లికేషన్స్ టెస్ట్ చేసుకోవచ్చు.. నాకు డ్రోన్ కంపెనీల నుంచీ ఏపీలో ఏం కావాలో అడుగుతాను.. యుద్ధాలలో డ్రోన్ లను వినియోగిస్తున్నారు… ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.. ఇండియా ప్రపంచ వ్యాప్తంగా నాలెడ్జి ఎకానమీతో పని చేయగలదు.. ఏపీ ఎకో సిస్టంను బలపరిచేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కోసం సిద్ధం చేస్తాం.. ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు కోసం ప్రత్యేక ప్లాట్ ఫాంగా ఏపీ ఉంటుంది.. డ్రోన్ టెక్నాలజీలో అభివృద్ధి చేయగల పరిస్ధితిలోకి ఏపీ వస్తుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!