దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమైన విషయం విదితమే.. అయితే, ఈ పథకం లబ్ధిదారులకు గుడ్న్యూస్ చెబుతూ.. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ఈ రోజు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
మహిళల కోసం ఉచితంగా మూడు సిలిండర్ల పథకం తీసుకొచ్చాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అయితే, ఈ పథకంలో ఎవరూ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదన్నారు.. గ్యాస్ కనెక్షన్, రైస్ కార్డు (రేషన్ కార్డు)లకు ఆధార్ కార్డు నంబర్ అనుసంధానం చేసుకుని ఉంటే చాలు.. వారు అర్హులే అని స్పస్టం చేశారు..
ఈ రోజు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సమావేశంకానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగనుంది.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలుపై నీతి ఆయోగ్ సీఈవో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు..
AP Cabinet: నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలో గల సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందన్నారు. క్రికెట్ బోర్డు బాగా పని చేస్తోంది.. చంద్రబాబు నుంచీ ప్రామిస్ అనేకంటే ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది.. ఇండియన్ గోల్ఫ్ కి నేను ప్రెసిడెంట్.. ఎక్కడ భూమి ఇస్తుందనేది ప్రభుత్వానిదే నిర్ణయం.. స్పోర్ట్స్ సిటీ ఇస్తే నేను చాలా సంతోషిస్తాను.. 20 సంవత్సరాల నుంచి క్రికెట్ లో ముందున్నామని కపిల్ దేవ్ వెల్లడించారు.
Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ స్టార్ట్ అయింది. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు.
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖర్చు చేశాం.. కానీ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.