ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నిర్మాణ పనులు చేస్తు్న్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.
ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. రేప్ జరిగింది అన్న విషయాన్ని కప్పిపెట్టడానికి అనేక హాస్పిటల్స్కి తిప్పారని ఆరోపించారు.
నేడు కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. మొదట డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు సీఎం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన క్రీడా విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు బిచ్చగాళ్ళలాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధ్యానం కొనుగోళ్ళు వెంటనే చేబట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎంతమందికి అయ్యింది? అని…
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఇవాళ జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. 41వేల కోట్ల టెండర్లను 2014-19లో పిలిచి 38వేల కోట్ల పనులు ప్రారంభించామని చెప్పారు. మధ్యలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.