Estimates Committee Chairman: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ ఎమ్మెల్యేగా వరసగా నాలుగు సార్లు గెలుపొందిన సీనియర్ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ హోదా దక్కనుంది. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల నియమితులు కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్ గా నియమితులు కానున్నారు.. ఈ మేరకు వేగుళ్లకుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. మండపేట నియోజకవర్గం ఆవిర్భవించిన 2009 నుంచి టీపీపీ తరఫున బదిలోకి దిగి నాలుగు సార్లు వరుసగా 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ పదవి వరించింది. కేబినెట్ హోదా కలిగిన పదవి మండపేట నియోజక వర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎమ్మెల్యే గా ఎన్నికయిన వారికి దక్కనుంది..
Read Also: India-Canada: కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్
ఎమ్మెల్యే వేగుళ్ల 2000లో టీడీపీలో తన ప్రస్థానం ఆరంభించారు. అదే ఏడాది మార్చిలో జరిగిన మునిసిపల్ ప్రత్యక్ష ఛైర్మెన్ ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచారు. అనూహ్యంగా 2004లో టీడీపీ అభ్యర్థిగా అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. అనంతరం నియోజకవర్గ పునర్విభజన లో 2009 లో మండపేట ఏర్పాటైంది. అప్పటి నుండి నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యే వేగుళ్ల ఇక్కడ గెలుపొందుతూ వస్తున్నారు. ప్రతికూల సమయంలోనూ అనుకూల ఫలితాలు రాబట్టిన ఘనత ఆయనదే. ఈ నేపథ్యంలో ఈసారి వేగుళ్లకు మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించారు. కాగా, సామాజికవర్గాల తూకంలో ఈయనకు మంత్రి పదవి రాలేదు. కాగా, రాజకీయాల్లో తనదైన శైలి ప్రదర్శించే ఈయనను చంద్రబాబు ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ కట్టబెట్టారు.. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్లను మంత్రివర్గం ఎంపిక చేసింది. అధికారికంగా ఈ రోజు శాసనసభలో ఛైర్మన్‌తో పాటు మరో 8 మంది సభ్యుల కార్యవర్గం ప్రకటిస్తారు. 2009 నుంచి వేగుళ్ల అనేక కమిటీల్లో సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వేగుళ్లకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో.. టీడీపీ శ్రీణుల్లో ఆనందం వెల్లు విరుస్తుంది.