మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి ఆయన ‘X’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన విజయం.. మోడీ పరివర్తనాత్మక ఆలోచనలు, వికసిత భారత్‌ను సాధించే విధానాలను ప్రజలు నమ్మారని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు.
Read Also: AUS vs IND: ఐయామ్ ఇంప్రెస్‌డ్.. బుమ్రాపై ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు!
మహారాష్ట్ర ఎన్నికల్లో మహయుతి కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఆ కూటమి 229 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మహా వికాస్ అఘాడీ 51 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నది. ఇది మ్యాజిక్ ఫిగర్ 145 కంటే చాలా ఎక్కువ. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. ఈ క్రమంలో మహాయుతి కూటమికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు.
Congratulations to the Mahayuti Alliance on securing a historic mandate in Maharashtra. This victory reflects people's continued trust in the leadership of the Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose strategic vision, transformative policies and devotion to the people… pic.twitter.com/u40WTplSyh
— N Chandrababu Naidu (@ncbn) November 23, 2024
Read Also: Devendra Fadnavis: “అన్నంత పనిచేసిన ఫడ్నవీస్”.. 2019లో చేసిన కామెంట్స్ వైరల్..