ఈరోజు ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు.. జనసేన ఎంపీలతో క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు పవన్ దిశానిర్దేశం చేశారు.
School ground: విద్యావ్యవస్థకే మాయనిమచ్చ.. మద్యం సేవించి స్కూల్‌లో పడ్డ ప్రిన్సిపాల్, టీచర్
సమావేశం అనంతరం.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి చర్చించాం.. ఇరిగేషన్, నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి చర్చించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను కూడా చంద్రబాబు రిలీజ్ చేసారు.. దానిలోనూ కేంద్ర అనుసంధాన పనులున్నాయని తెలిపారు. పెట్టుబడులను తీసుకురావడంలో కేంద్రంతో అనుసంధానం చేసి పూర్తి చేయడంలో ముందుండాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. పలు అంశాల పరిష్కారం వైపు నడిపించాలని సీఎం దిశా నిర్దేశం చేసారన్నారు. బ్రాండ్ ఏపీని రీ క్రియేట్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.. 25 పాలసీలు తీసుకురావడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. జగన్ ఒక ఎస్కోబార్ లా తయారయ్యాడు.. ఆర్ధిక అసమతుల్యత ఎప్పుడు వచ్చినా ఏపీపై మాట్లాడుతున్నారు.. అన్నీ జగన్ చుట్టే తిరుగుతున్నాయని పేర్కొన్నారు.
IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన లబుషేన్.. అతని దగ్గరికి వెళ్లి ఏం చేశాడంటే..? (వీడియో)
ఎంపీ లావు కృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో మాట్లాడాల్సిన అంశంపై చంద్రబాబు దిశ నిర్దేశం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా తాము ఏపీ పరిస్థితి వివరించామని తెలిపారు. ఏపీ విజన్ డాక్యుమెంట్, 6 ఇండస్ట్రీయల్ పాలసీలపై మాట్లాడతామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారినే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారిని కూడా ఒప్పించాలి.. పోలవరం, రాయలసీమకు వచ్చి ఆగిపోయినవి, నదుల అనుసంధానం పై సమావేశాలలో మాట్లాడతామని ఎంపీ తెలిపారు. చాలామంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు.. రాబోతున్న బిల్స్ పైన కూడా చర్చ జరిగిందని లావు కృష్ణదేవరాయులు పేర్కొన్నారు.