నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే ఫస్ట్ టైం.
Bhagwant Mann: ఖలిస్తాన్ మద్దతుదారు, ఈ ఏడాది పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్‌పాల్, అతడి సన్నిహితుల నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకే కాకుండా, సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పారు. పంజాబ్ పోలీసులు వారి వాదనలకు మద్దతుగా గతంలో అమృత్‌పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించి వీడియో క్లిప్‌లను ప్రస్తావించారు.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.. పంజాబ్ లో మరో 4 స్థానాలను పెండింగ్ లో ఉంచారు. ఆ నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై సీఎం భగవంత్ మాన్ ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పారు. జలంధర్, లూథియానా స్థానాలకు అభ్యర్థులను ఈ రోజున ప్రకటిస్తుందని సీఎం భగవంత్ మాన్ 'X' లో సమాచారం ఇచ్చారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 1న ఆయన్ను అధికారులు జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
IVF Case: దివంగత పాప్ సింగర్ సిద్ధు మూసేవాలా తల్లి ఇటీవల ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది. అయితే, 21-50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు మాత్రమే ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అర్హులనే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిద్దూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ వయసు 58 ఏళ్లు. మే 29, 2022లో పంజాబ్ మాన్సాలో 28 ఏళ్ల సిద్దూ మూసేవాలా హత్యకు గురయ్యారు.…
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విజయం నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన తర్వాత పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ రాష్ట్ర విభాగం నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో.. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆప్‌తో…
Punjab: పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు.
Supreme Court: పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. విచారణ సందర్భంగా, 'మీరు నిప్పుతో ఆడుతున్నారు' అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.