పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. రేపు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్ వివాహం జరగనుంది. తన ఇంట్లోనే పెళ్లి కార్యక్రమం జరగనున్నట్లు తెలిసింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉంది. భగవంత్ మాన్ కి ఇది రెండో పెళ్లి, 48 ఏళ్ల…
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి కొన్ని నెలలు కాకముందే ఉప ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సంగ్రూర్ లోక్ సభ స్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ స్థానం నుంచి శిరోమణి అకాలీదళ్(అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ గెలుపొందారు. హోరాహోరీగా జరిగిన పోరులో ఆప్ అభ్యర్థి గుర్‌మైల్ సింగ్‌పై 5,800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దీంతో, ఢిల్లీ పరిమితం అనుకున్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.. ఇక, ఢిల్లీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.. పంజాబ్‌లో పరిస్థితి వేరు.. తాము ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ ప్రభుత్వం.. ఆ…
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ విరుచుకుపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ ధ్వజమెత్తారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, అరవింద్ కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆరోపించారు సిద్ధూ… భగవంత్ మాన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం చెన్నీ, సిద్ధూతో సహా కాంగ్రెస్ నేతలు గవర్నర్ భన్వరీలాల్‌తో భేటీ అయ్యారు.. వాటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇక, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తోంది పంజాబ్ సర్కార్.. దీనిపై పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. పంజాబ్…