లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.. పంజాబ్ లో మరో 4 స్థానాలను పెండింగ్ లో ఉంచారు. ఆ నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై సీఎం భగవంత్ మాన్ ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పారు. జలంధర్, లూథియానా స్థానాలకు అభ్యర్థులను ఈ రోజున ప్రకటిస్తుందని సీఎం భగవంత్ మాన్ ‘X’ లో సమాచారం ఇచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తన మిగిలిన నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి సమయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 16న జలంధర్, లూథియానా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆప్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో పాటు, రాజ్యసభ సభ్యులు సందీప్ పాఠక్, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
Read Also: Janasena Chief: రాష్ట్ర ప్రజల భవిష్యత్త్ బాగుండాలనే పొత్తుకి కృషి చేశా..
పంజాబ్‌లోని 13 సీట్లలో 9 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాగా.. గురుదాస్‌పూర్, ఫిరోజ్‌పూర్, లూథియానా, జలంధర్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో ఉంచారు. ఇంతకుముందు జలంధర్‌లో ఆప్ అభ్యర్థిగా సుశీల్ రింకును నిలబెట్టింది.. అయితే అతను తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఈ సీటుపై ఆప్ బలమైన అభ్యర్థి కోసం వెతుకుంది.
ఫిరోజ్‌పూర్ సీటులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫిరోజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జలాలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే జగదీప్ సింగ్ గోల్డీ కాంబోజ్ తండ్రి సురీందర్ కాంబోజ్‌ను బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది.
Read Also: RBI: తమ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏది అంటున్న ఆర్బిఐ..!