Amit Shah: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పంజాబ్ గురుదాస్ పూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. భగవంత్ మాన్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించడం లేదని, అరవింద్ కేజ్రీవాల్ దేశ పర్యటనలకు రాష్ట్రవిమానాన్ని తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నాడని ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రా..? లేక పోలే కేజ్రీవాల్ పైలెటా..? అని ప్రశ్నించారు.
AAP: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
CM Bhagwant Mann: ఖలిస్తానీ వేర్పాటువాదులు, రాడికల్ సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ కార్యకర్తలు, దాని చీఫ్ అమృత్ పాల్ సింగ్ అజ్నాలాలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో మళ్లీ ఖలిస్తాన్ పేరుతోె విభజన బీజాలు నాటాలని ప్రయత్నిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ అనుచరుడు జైలులో ఉన్న లవ్ ప్రీత్ సింగ్ తూఫాన్ ను విడిపించేందుకు పెద్ద ఎత్తున ఖలిస్తానీ వేర్పాటువాదులు కత్తులు, ఇతర ఆయుధాలతో…
Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్…
Chandigarh University Video Leak Case: చండీగఢ్ వీడియో లీక్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 60 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలను మరో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌కు పంపిందనే వార్తల నేపథ్యంలో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థినులు ఆందోళన చేశారు. హస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో అసభ్యకరమైన రీతిలో వీడియోలు తీశారంటూ విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసులో ట్విస్ట్…
Bhagwant Mann Says PM Modi's January Security Breach Incident Unfortunate: పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. బుధవారం పంజాబ్ లో పర్యటించారు ప్రధాని మోదీ. గత జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తింది. ఫిరోజ్ పూర్ పర్యటనలో భాగంగా పంజాబ్ వెళ్లిన ప్రధాని కాన్వాయ్ కొంత సేపు ఓ ఫ్లై ఓవర్ పై ఉండటం అప్పట్లో వివాదానికి…
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం చంఢీగర్లోని సీఎం నివాసంలో డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను వివాహం చేసున్నాడు మాన్. హర్యాన కురుక్షేత్రకు చెందిన గుర్ ప్రీత్ కౌర్, సీఎం భార్య కావడంతో ఒక్కసారిగా నెటిజెన్లు ఈమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. డాక్టర్ అయిన గుర్ ప్రీత్ కౌర్, గత ఎన్నికల్లో భగవంత్ మాన్ కు సహకరించిందని తెలుస్తోంది. భగవంత్ మాన్ కుటుంబానికి, గుర్ ప్రతీ కౌర్ కుటుంబానికి సన్నిహిత…
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. చంఢీగఢ్ లోని సెక్టార్ 2లోని ముఖ్యమంత్రి ఇంటి వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. సన్నిహితులు, బంధువులతో పాటు ఆప్ జాతీయ కన్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేత రాఘవ్ చద్ధా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన డాక్టరైన గురుప్రీత్ కౌర్ ను భగవంత్ మాన్ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు…
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వివాహం అయిన 48 ఏళ్ల మాన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆరేళ్ల క్రితం తన భార్య ఇంద్రప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చాడు సీఎం మాన్. అయితే తాజాగా మరో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో చంఢీగడ్ లో వివాహం జరగనుంది. పంజాబ్ లో తొలిసారి పాగా వేసిన ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెళ్లి చేసుకునే అమ్మాయి…