Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Nitis Kumar's comments on Prime Ministerial candidature: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎన్డీయేతర కూటమికి సంబంధించిన పార్టీ నాయకులను వరసగా కలుస్తున్నారు. ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు నితీష్ కుమార్. అయితే ఇప్పటికే ఆర్జేడీ పార్టీలో పాటు జేడీయూ కూడా నితీష్ కుమార్ 2024లో ప్రధాని రేసులో ఉంటారని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కీలక…
CM Arvind kejriwal comments on BJP over Gujarat elections: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ సారి గుజరాత్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తోంది. బీజేపీ నుంచి అధికారాన్ని తీసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కార్యకర్తలను, నాయకులును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు…
Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని
ఢిల్లీలో పొలిటికల్ హీట్ మొదలైంది.. ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో పడనుందా..? అనే చర్చ మొదలైంది.. సీఎం కేజ్రీవాల్‌తో నిర్వహించిన కీలక భేటీకి చాలా మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై… అనుమానాలు రేగుతున్నాయి. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచారు సీఎం కేజ్రీవాల్. ఎమ్మెల్యేలందరినీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం…
Delhi deputy CM Manish Sisodia made sensational comments against BJP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ లిక్కర్ స్కామ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ1 నిందితుడి.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారం బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ షాపింగ్ ఫెస్టివల్ ను ఢిల్లీలో నిర్వహించనున్నారు. దీన్ని ప్రపంచంలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. 2023 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 30 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనుంది…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి…